జూబ్లీహిల్స్, వెలుగు: జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 59లో ఉన్న ముకుంద జువెలరీ షోరూంలో మూడు తులాల బంగారం చోరీకి గురైంది. షోరూం మేనేజర్ ప్రమోద్ రెడ్డి ప్రతిరోజూ చేసే స్టాక్ తనిఖీలో భాగంగా నగలను పరిశీలించగా, అసలు బంగారు ఆభరణాల స్థానంలో నకిలీ ఆభరణాలు ఉన్నట్లు గుర్తించారు. షోరూంలో పనిచేసే సిబ్బందే ఈ పని చేసి ఉండవచ్చని ఆయన జూబ్లీహిల్స్ పీఎస్లో ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా
దర్యాప్తు చేస్తున్నారు.
