
గుజరాత్ జనాభాలో దాదాపు పది శాతం వాటా.. కొన్నిచోట్ల చెప్పుకోదగ్గ సంఖ్యలో ఓట్లు ఉన్నప్పటి కీ లోక్ సభలో ఒక్క ముస్లిం సభ్యుడూ లేరు. చివరిసారిగా 1984 కాంగ్రెస్ సీనియర్ నేత అ హ్మద్ పటేల్ భరూ చ్ నుంచి గెలిచి లోక్ సభలో అడుగుపెట్టా రు. ఆ తర్వాత ఈ 30 ఏళ్లలో గుజరాత్ నుంచి ఒక్క ముస్లిం సభ్యుడూ లోక్ సభకు వెళ్లలేదు. తర్వాతి ఎన్నికల్లో ఆ సీటును బీజేపీ గెలుచుకుం ది. రాష్ట్రం ఏర్పడ్డ రెండేళ్లకు 1962లో తొలిసారిగా లో క్ సభ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గెలిచిన ఏకైక ముస్లిం ఎంపీ జోహ్రా చావడా.తర్వాతి ఎన్నికల్లో అహ్మద్ పటేల్, ఈషాన్ జాఫ్రీ గెలుపొందారు. రాష్ట్రంలో నే ముస్లిం లు ఎక్కువగా ఉండే ప్రాంతం భరూచ్.. ఇక్కడి మొత్తం 15.64 లక్షల ఓటర్లు ఉండగా, అందులో 22.2 శాతం ముస్లింలే కా వడం విశేషం. అక్కడ ఇప్పటి వరకు 8 మంది అభ్యర్ థులు (తొలి ఎన్నికల నుంచి గత లోక్ సభ ఎన్నికల దాకా ) పోటీ చేసినా అహ్మద్ పటేల్ తప్ప మిగతా వాళ్లెవరూ గెలవలేదు.
లోక్ సభ బరిలో…
1989లో రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ముస్లిం అభ్యర్థులు పోటీ చేయగా.. గత అసెంబ్లీ ఎన్నికల్లో 67మంది ముస్లిం లు పోటీ చేశారు. ఇందులో నవసారి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన మక్సూద్ మిజ్రా మినహా మిగతా 66 మంది స్వతంత్ర అభ్యర్ థులుగా,సమాజ్ వాదీ తదితర పార్టీల తరఫున పోటీ చేశారు.వీరిలో పంచమహల్, ఖేడా, ఆనంద్, భరూచ్,నవసారి, సబ కాంత, జాం నగర్, జునాగఢ్ స్థానాల నుంచే ఎక్కువ మంది బరిలో నిలిచారు.