యూట్యూబర్, కరాటే కళ్యాణి మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు దాడి

యూట్యూబర్, కరాటే కళ్యాణి మధ్య గొడవ.. ఒకరిపై ఒకరు దాడి

యూట్యూబర్, ఫ్రాంక్ స్టార్ శ్రీకాంత్ రెడ్డిపై జూనియర్ ఆర్టిస్ట్ కరాటే కల్యాణి దాడి చేశారు.హైదరాబాద్ యూసుఫ్ గూడలో గురువారం రాత్రి ఘటన జరిగింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కరాటే కల్యాణి ఓ పసిపాపను ఎత్తుకొని మరీ యూసుఫ్ గూడ బస్తీలోని శ్రీకాంత్ ఇంటి దగ్గరకు వెళ్లి దాడి చేసింది. మహిళలను ఇష్టం వచ్చినట్టు అసభ్యంగా చిత్రీకరిస్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్రాంక్ పేరుతో అమ్మాయిలను ఫ్లర్టింగ్ చేసి మహిళల గౌరవాన్ని దెబ్బతీస్తున్నాడని ఆరోపించింది. కల్యాణి దాడి చేస్తుండగా.... అక్కడే ఉన్న మరో వ్యక్తి కూడా శ్రీకాంత్ ను కొట్టాడు. అటు శ్రీకాంత్ కూడా కరాటే కల్యాణిని కొట్టడంతో ఆమె కిందపడిపోయింది. తర్వాత ఇద్దరు ఎస్ఆర్ నగర్ పీఎస్ లో కంప్లైంట్లు చేసుకున్నారు.

మరిన్ని వార్తల కోసం 

పాలమూరు నుంచి 2 లక్షల మందికి పైగా వలస పోయిన్రు

సమ్మర్ లో బొప్పాయి ఫేస్ ప్యాక్ బెటర్