ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాలివే

ఓటీటీ ప్లాట్ ఫాములు వచ్చాక థియేటర్లో చూసే వాళ్ల కన్నా ఆన్ లైన్లో చూసేవారి సంఖ్యే పెరుగుతోంది. కరోనా పుణ్యమా అని అమెజాన్, నెట్ ఫ్లిక్స్, ఆహా, జీ5 లాంటి వాటికైతే డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. దీనికి తోడు సినిమా టికెట్ల ధరలు కూడా పెరగడంతో వీక్షకుడు దాదాపు ఇంట్లో కూర్చొని సినిమాను చూడడానికే ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. అయితే థియేటర్లలో ఎంత గొప్ప సినిమా రిలీజ్ అయినా.. అది ఓటీటీలోకి ఎప్పుడొస్తుందా అని ఎదురుచూసే వారు రోజురోజుకూ పెరుగుతోంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా చాలా సినిమాలు నెట్టింట్లో సందడి చేయడానికి సిద్ధమయ్యాయి. 

ప్లాపులు, హిట్లను పట్టించుకోకుండా అదే ఉత్సాహంతో దూసుకుపోతూ వరుస సినిమాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం, చాందినీ చౌదరీ హీరోహీరోయిన్లుగా నటించిన ‘‘‘సమ్మతమే’’ సినిమా తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహాలో జులై 15 శుక్రవారం రాత్రి 12గంటలకు ప్రసారం కాబోతుంది. జూన్ 24న థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మిక్స్ డ్ రెస్పాన్స్ తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక యంగ్ హీరో సుశాంత్ కూడా ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆయన రీసెంట్ గా మెయిన్ లీడ్ రోల్ చేసిన ‘‘మా నీళ్ల ట్యాంక్’’ అనే వెబ్ సిరీస్ ప్రస్తుతం ‘జీ 5’’ లో ప్రసారం అవుతోంది. 8 -ఎపిసోడ్‌ల ఈ సిరీస్ ఒక ఫీల్ గుడ్ రూరల్ డ్రామా. ఇందులో నటి ప్రియా ఆనంద్ 10 సంవత్సరాల విరామం తర్వాత తెలుగు తెరపై నటిస్తున్న ఈ సిరీస్‌కి వరుడు కావలెను మూవీ ఫేం లక్ష్మీ సౌజన్య డైరెక్టర్. తెలుగుతో పాటు తమిళంలోనూ ఈ సిరీస్ అవేలబుల్ గా ఉంది.

హీరో విజయ్ సేతుపతి, గాయత్రి నటించిన మూవీ ‘‘మా మన్నితన్’’ అనే తమిళ్ సినిమా రీసెంట్ గా (జులై 15) ఆహాలో ప్రసారం అయ్యింది. గత మూడు వారాల కిందట థియేటర్లలో ఆడిన ఈ మూవీ.. మిశ్రమ స్పందనను సొంతం చేసుకుంది. ఇక రెజీనా కాసాండ్రా, మకరంద్ దేశ్ పాండే, ఆదిల్ ఖాన్, కుల్ దీప్ నటించిన సిరీస్ ‘‘శూర్ వీర్’’ అనే మిలిటరీ డ్రామా గా తెరకెక్కిన ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. గోపీ గణేశ్‌ దర్శకత్వంలో హీరో సత్యదేవ్‌ ఇటీవల హీరోగా నటించిన 'గాడ్సే' చిత్రం ఈ నెల 17న (జులై 17) ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. కీర్తిసురేష్, టివోనో థామస్ ప్రధాన పాత్రల్లో నటించిన మలయాళ చిత్రం వాశీ కూడా ఆ రోజే నెట్ ఫ్లిక్స్ లో సందడి చేయనుంది. వీటితో పాటు హిందీలో జాదుగర్ సిరీస్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుండగా, కామిక్ స్థాన్ సిరీస్ అమెజాన్ లో అవేలబుల్ గా ఉన్నాయి.