ఒక్క ‘టీ’బ్యాగు..1100 కోట్ల ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ కణాలు

ఒక్క ‘టీ’బ్యాగు..1100 కోట్ల  ప్లాస్టిక్‌‌‌‌‌‌‌‌ కణాలు

వామ్మో.. మనం తాగుతున్న చాయ్​లో ప్లాస్టిక్ ఉందా? అని అప్పుడే భయపడిపోకండి. ఇక్కడ చెబుతున్నది టీ బ్యాగుల వాడకం గురించి! వేడి వేడి నీళ్లు లేదా పాలలో ముంచుకుని చిటికెలో కమ్మటి చాయ్‌‌‌‌ని తాగేందుకు చాలా మంది టీ బ్యాగులను వాడుతుంటారు. అయితే, చాలా కంపెనీలు పేపర్ టీ బ్యాగులనే తయారు చేస్తున్నా, కొన్ని ప్రీమియం బ్రాండ్లు టీ బ్యాగుల తయారీకి మాత్రం సన్నటి ప్లాస్టిక్ నెట్‌‌‌‌ను వాడుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ప్లాస్టిక్ టీ బ్యాగులు సేఫేనా? కాదా? వీటి నుంచి ఎంత ప్లాస్టిక్ మనం తాగే టీలో కలుస్తోంది? అన్నది తెలుసుకునేందుకు కెనడాలోని మెక్ గిల్ యూనివర్సిటీ రీసెర్చర్లు ఇటీవల టెస్ట్ చేశారు. నాలుగు ప్రీమియం బ్రాండ్లకు చెందిన టీ బ్యాగులను తీసుకుని, 95 డిగ్రీల వేడి నీటిలో  వేర్వేరుగా వేశారు. తర్వాత ఆ నీటిని పరీక్షించగా.. అందులో మన కంటికి కనిపించని మైక్రో ప్లాస్టిక్ కణాలు ఉన్నాయని తేలింది. ఒక్కో సింగిల్ ప్లాస్టిక్ టీ బ్యాగు నుంచి ఏకంగా 1160 కోట్ల మైక్రోప్లాస్టిక్‌‌‌‌ కణాలు, 310 కోట్ల నానోప్లాస్టిక్ కణాలు ఉన్నట్టు తేల్చారు.