ఎండల్లో ఈ డ్రెస్​లు హాయి

ఎండల్లో ఈ డ్రెస్​లు హాయి

ఎండ వల్ల బాగా ఉబ్బరిస్తుంది. చెమట పడుతుంది. దాంతో చికాకు కలుగుతుంది. చెమట ఎక్కువ పట్టడంతో చర్మంపైన దద్దుర్లు, దురద లాంటి స్కిన్ ఎలర్జీలు వస్తాయి. వాటి బారిన పడకుండా ఉండటానికి కొన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌‌ ఉపయోగపడతాయి. వాటివల్ల వేసవిలో కలిగే అసౌకర్యాలు కూడా పోతాయి. అందుకు ఉపయోగపడే కొన్ని ఫ్యాబ్రిక్స్‌‌ ఇవి..   

  •   లెనిన్‌‌ ఫ్యాబ్రిక్‌‌‌‌ను ఫ్లాక్స్‌‌ ఫైబర్‌‌‌‌ నుండి తయారుచేస్తారు. ఇది ఎక్కువ కాలం మన్నడంతో పాటు శరీరానికి గాలి బాగా తగిలేలా చేస్తుంది. లెనిన్ ఫైబర్‌‌‌‌ బ్యాక్టీరియాను పోగొట్టే లక్షణాలను కలిగి ఉంటుంది. ఈ క్లాత్‌‌ చర్మంపైన ఉన్న డెడ్‌‌ స్కిన్ సెల్స్‌‌ను పోగొడుతుంది. ఇది శరీరాన్ని మసాజ్‌‌ కూడా చేస్తుంది. చెమటను పీల్చుకొని శరీరానికి చల్లదనాన్ని ఇస్తుంది. 

  •   హెంప్‌‌ ఫ్యాబ్రిక్‌‌‌‌ను (జనపనార) టాక్సిన్‌‌ ఫ్రీ అంటారు. ఎందుకంటే ఇది వేసుకు న్నపుడు చర్మానికి హాని చేసే బ్యాక్టీరియా పోగొడుతుంది. మిగతా ఫైబర్‌‌‌‌లతో పోల్చితే ఇది కొంత గట్టిగా ఉంటుంది. వాడుతున్న కొద్దీ మృదువుగా తయారై శరీరానికి సాఫ్ట్‌‌ ఫీల్‌‌ను ఇస్తుంది. సూర్యుని వల్ల వచ్చే యూవీ కిరణాలను శరీరానికి తగలనివ్వదు.  
  •   కాటన్ ఫ్యాబ్రిక్‌‌‌‌ (పత్తి) వంద శాతం హైపో ఎలర్జెనిక్‌‌గా ఉంటుంది. అంటే చర్మానికి ఎలర్జీలను కలిగించే బ్యాక్టీరియాను తొలగిస్తుంది. పలుచగా ఉండి శరీరానికి గాలి ఆడేలా చేస్తుంది. చల్లగా ఉంచుతుంది. దాంతో ఎండ వల్ల చర్మానికి కలిగే చికాకు పోతుంది. కాటన్‌‌ క్లాత్‌‌ ఎంత చెమట పట్టినా పీల్చుకొని శరీరాన్ని పొడిగా ఉంచుతుంది. దాంతో చెమటతో పాటు బయటికి వచ్చిన బ్యాక్టీరియాను చర్మంపైన నిలవకుండా చేసి స్కిన్ ఎలర్జీలు రాకుండా చేస్తుంది.
  •   సిల్క్‌‌లో యాంటీబాక్టీరియల్‌‌ ప్రాపర్టీస్‌‌ ఉంటాయి. ఇది కూడా హైపో‌‌ ఎలర్జెనిక్‌‌గా పనిచేస్తుంది. శరీరానికి వేడిని తగలకుండా చేస్తుంది. చర్మం పైన ఉండే తేమను పీలుస్తుంది. చర్మం పగిలిపోకుండా కాపాడుతుంది. సిల్క్‌‌కు ఉన్న సహజ నెగెటివ్‌‌ అయాన్ లక్షణాల వల్ల పొడి బారిపోకుండా చేసి ఫ్రెష్‌‌గా, హైడ్రేటెడ్‌‌గా ఉంచుతుంది.

  •  లాన్ ఫ్యాబ్రిక్‌‌ను సెమి షీర్, లెనిన్, కాటన్‌‌ లను కలిపి తయారుచేస్తారు. ఇది పలుచగా ఉండటం వల్ల గాలి బాగా ఆడుతుంది. దాంతో చెమట ఎక్కువసేపు చర్మంపైన ఉండదు.