భర్త రణ్ బీర్ ఓపికను మెచ్చుకున్న ఆలియా భట్

భర్త రణ్ బీర్ ఓపికను మెచ్చుకున్న ఆలియా భట్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే స్టార్ హీరోయిన్లలో ఒకరైన ఆలియా భట్ షేర్ చేసిన ఫొటో ప్రస్తుతం వైరల్ గా మారింది. తన భర్త రణ్ బీర్ కపూర్ గురించి ప్రస్తావిస్తూ పోస్ట్ చేసిన ఆలియా.. అతని ఓపికను మెచ్చుకుంది. మదర్ ఉడ్ ను ఆస్వాదిస్తోన్న ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల ముంబైలో జరిగిన జీ సినీ అవార్డులో రెడ్ కార్పెట్ పై మెరిసింది. సీ గ్రీన్ కలర్ గౌనులో అందర్నీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో 'గంగూబాయి కతియావాడి' చిత్రానికి గానూ అలియా ఉత్తమ నటి అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డును పట్టుకొని ఉన్న ఫొటోను ఆలియా తాజాగా తన ఇన్స్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది.  గంగు ప్రేమ అని రాసుకొస్తూ.. జీ సినీ అవార్డ్స్‌కి కృతజ్ఞతలు తెలియజేసింది.

తాను ఎంత కృతజ్ఞతతో ఉన్నానో చెప్పడానికి పదాలు సరిపోవని ఆలియా ఆనందం వ్యక్తం చేసింది. దాంతో పాటు భన్సాలీ ప్రొడక్షన్స్ ను ట్యాగ్ చేసింది. అయితే  ఈ ఫొటోను తన భర్త రణబీర్ తెల్లవారుజామున 2 గంటలకు క్లిక్ చేయడం విశేషం. ఆలియా ఈ విషయాన్ని తెలియజేస్తూ.. తన ఫొటోను తెల్లవారుజామున 2 గంటలకు ఓపికగా తీసినందుకు తన భర్తను ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నానంటూ ఓ వెరైటీ ఎమోజీ సింబల్స్ ను పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

https://www.instagram.com/aliaabhatt/