అప్పుడే పుట్టిన పసికందులను, నెలల పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటాం. ఎందుకంటే.. చిన్నారుల శరీరం అత్యంత సున్నితంగా, కోమలంగా ఉంటుంది. ఎంత ముద్దొస్తున్నా బుగ్గలు ముట్టుకోవడానికి కూడా కందిపోతాయేమోనని ఆలోచిస్తుంటాం. కానీ.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మాత్రం ‘‘అసలు వీడు మనిషేనా..? కొద్దిగైనా మతి ఉండే ప్రవర్తిస్తున్నాడా..?’’ అనే సందేహం రావడం ఖాయం. చిన్న పాప.. ఇంకా హాస్పిటల్ నుంచి తల్లీబిడ్డను ఇంటికి కూడా పంపలేదు.
హాస్పిటల్లో తల్లి పొత్తిళ్లలో ఉన్న పసికందును ఒక్క చేత్తో గాల్లోకి అటూఇటూ ఇష్టమొచ్చినట్లు విసిరేస్తూ ఉన్న ఒక మానవ మృగం వీడియో నెట్టింట వైరల్ అయింది. అతనికి కనీస కనికరం లేదని.. ఇంగిత జ్ఞానం లేదని ఈ వీడియో చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. ఎక్కడ జరిగిందో తెలియదు గానీ వీడియోలో ఉన్న మహిళల వస్త్రధారణ చూస్తే ఉత్తరాది రాష్ట్రం అని స్పష్టంగా తెలుస్తుంది. అంత దారుణంగా పసికందును ఆట బొమ్మలా గాల్లోకి విసిరేస్తుంటే ఆ పాప తల్లి గానీ, హాస్పిటల్లో ఉన్న ఏ ఒక్కరు గానీ కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయకపోవడం విస్మయానికి గురిచేసింది.
यह वीडियो कहां की है मुझे नहीं मालूम पर यह वीडियो देखकर मुझे बच्चे के ऊपर दया रही है और गुस्सा भी आ रही है
— Pihu...❤️ (@Pihukh) June 17, 2026
यहां बेहद चिंताजनक और आस्वीकार व्यवहार है नवजात शिशु कोई खिलौना नहीं कि
उसे इस तरह उछाला जाय असंवेदनशील तरीके से संभाला जाए अस्पताल जैसे
संवेदनशील स्थान पर ऐसी… pic.twitter.com/9At2nmkwoq
పైగా.. అతను పసికందును అలా తెలివి లేకుండా గాల్లోకి విసిరేస్తుంటే ఏం జరగనట్టు చోద్యం చూస్తూ ఉండిపోవడం ఈ ఘటన మొత్తంలో అత్యంత బాధాకరమైన విషయం. ఇంత అమానుషంగా పసికందును ఆటబొమ్మలా గాల్లోకి విసిరేస్తున్న ఈ కనీస మానవత్వం లేని వ్యక్తిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో నెటిజన్లు డిమాండ్ చేశారు. ఉత్తర ప్రదేశ్, బీహార్ పోలీసులను ‘ఎక్స్’లో ట్యాగ్ చేసి.. ఈ ఘటనపై ఆరా తీయాలని సూచించారు.
►ALSO READ | ‘అమ్మా నాన్నా ఐ లవ్ యూ.. ఐ యామ్ సారీ’.. డెహ్రాడూన్‌లో నీట్ విద్యార్థిని ఆత్మహత్య
ఇలా చేయడం వల్ల.. నవజాత శిశువు మెదడు శాశ్వతంగా దెబ్బతింటుందని.. చివరికి మెదడు కణితులకు కూడా దారితీయవచ్చని కొందరు నెటిజన్లు వివరించారు. ఈ అమానుష ఘటనపై నాలుగైదు సెక్షన్ల కింద ఈ దుర్మార్గుడిపై కేసు నమోదు చేయొచ్చని తెలిపారు. ఇంత జరుగుతుంటే.. ఆసుపత్రి యాజమాన్యం నిద్రపోతోందా లేకపోతే అక్కడ ఉన్న మిగతా వారందరూ కూడా మూర్ఖులేనా అనే అనుమానం రాకుండా ఉండదు.
