ఇది రియల్ ‘గోల్డ్’ కార్డ్

ఇది రియల్ ‘గోల్డ్’ కార్డ్

రేరిస్ పేమెంట్ అకౌంట్ హోల్డర్ల కోసం తయారుచేసిన రాయల్ మింట్

ఇప్పటివరకూ మనం గోల్డ్, సిల్వర్, ప్లాటినం అంటూ రకరకాల ఏటీఎం కార్డులను చూశాం. కానీ అసలు సిసలు బంగారంతో తయారు చేసిన ‘గోల్డ్ కార్డ్’ను బ్రిటన్ రాయల్ మింట్ సంస్థ తయారు చేసింది. ఇది కూడా అసలైన డెబిట్ కార్డు లాగే పనిచేస్తుంది. కాకపోతే ఇది అకంప్లిష్​ ఫైనాన్షియల్ పేమెంట్స్ అనే సంస్థ నిర్వహిస్తున్న రేరిస్ అకౌంట్ హోల్డర్లకు మాత్రమే ప్రత్యేకం. అంటే ఇది ఒక పేమెంట్ కార్డ్‌‌గా మాత్రమే పని చేస్తుందన్నమాట. ఇక దీనిని18 క్యారెట్ల బంగారంతో తయారు చేశారు. దీనిపై మన పేరు, సంతకం ఉండేలా స్పెషల్‌‌గా కూడా తయారు చేయించుకోవచ్చు. మాస్టర్ కార్డ్‌‌తో కలిసి రాయల్ మింట్ ఈ పేమెంట్ కార్డును తయారు చేసింది.

ఈ కార్డు హోల్డర్లకు ఎలాంటి సర్వీస్ చార్జీలు వసూలు చేయమని, హోటల్ సర్వీసులు, ట్రావెలింగ్ బెనిఫిట్స్ కూడా అందిస్తామని అకంప్లిష్ ​ఫైనాన్షియల్ సంస్థ వెల్లడించింది. ఇలా మొత్తం బంగారంతో తయారుచేసిన మొట్టమొదటి పేమెంట్ కార్డ్ ఇదేనని చెబుతున్నారు. అసలైన బంగారం డెబిట్ కార్డ్ మన జేబులో ఉంటే మస్త్ ఉంటది కదా.. అనుకుంటున్నారా? అయితే ట్రై చేయండి. రేటెంతో చెప్పలేదు కదా.. జస్ట్ రూ. 16 లక్షలే! కార్డుపై పేరు, సంతకం కావాలంటే ఎక్స్ ట్రా అవుతుందట!