వచ్చే నెల 11న నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌లో ఈ రేసింగ్‌‌‌‌‌‌‌‌

వచ్చే నెల 11న నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌లో ఈ రేసింగ్‌‌‌‌‌‌‌‌

రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు టికెట్‌‌‌‌‌‌‌‌ రేట్లు

హైదరాబాద్, వెలుగు: ఫార్ములా -ఈ రేస్‌‌‌‌‌‌‌‌ టికెట్లను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో అందుబాటులో ఉంచారు. ఫిబ్రవరి 11న నెక్లెస్‌‌‌‌‌‌‌‌ రోడ్‌‌‌‌‌‌‌‌లో జరిగే ఈ రేస్‌‌‌‌‌‌‌‌ టికెట్లను బుక్‌‌‌‌‌‌‌‌మై షోలో విడుదల చేశారు. బుధవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జరిగిన టికెట్ లాంచింగ్ కార్యక్రమానికి చీఫ్ గెస్టుగా మున్సిపల్, అర్బన్ డెవలప్ మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్ హాజరై, మొదటి టికెట్‌‌‌‌‌‌‌‌ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా దేశంలో జరిగే మొట్టమొదటి ఏబీబీ ఎఫ్‌‌‌‌‌‌‌‌ఐఏ ఫార్ములా ఈ వరల్డ్ ఛాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్ రేసు కోసం తాను ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నానని మంత్రి కేటీఆర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మోటార్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ అభిమానులు రేసును చూసేందుకు టికెట్లను ఆన్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌‌‌‌‌లో బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్వింద్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మాట్లాడుతూ, ప్రపంచంలో టాప్ 25 సిటీల్లో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ను చేర్చడమే తమ లక్ష్యమన్నారు.

అందరికీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో టికెట్ల రేట్లను రూ.1,000 నుంచి మొదలు పెట్టామని చెప్పారు. 25 వేల సీటింగ్ కెపాసిటీ ఏర్పాటు చేయగా, 22,500 టికెట్లను అమ్మకానికి పెట్టామని తెలిపారు. రూ.1,000 నుంచి రూ.10 వేల వరకు టికెట్లు అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇందులో గ్రాండ్ స్టాండ్‌‌‌‌‌‌‌‌లకు రూ.1,000, చార్జ్‌‌‌‌‌‌‌‌డ్‌‌‌‌‌‌‌‌ గ్రాండ్ స్టాండ్‌‌‌‌‌‌‌‌లకు రూ.3,500, ప్రీమియం గ్రాండ్‌‌‌‌‌‌‌‌ స్టాండ్‌‌‌‌‌‌‌‌కు రూ.6 వేలు, ఏస్ గ్రాండ్‌‌‌‌‌‌‌‌ స్టాండ్‌‌‌‌‌‌‌‌లకు రూ.10 వేలుగా టికెట్‌‌‌‌‌‌‌‌ ధరలు నిర్ణయించామని పేర్కొన్నారు. ఫిబ్రవరి 10న ప్రాక్టిస్ రేసింగ్ ఉంటుందని చెప్పారు. 2.8 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన రేసింగ్ ట్రాక్‌‌‌‌‌‌‌‌లపై 11 దేశాల నుంచి 22 మంది రేసర్లు పాల్గొననున్నారు.