బడ్జెట్ సమావేశాల వేళ మహారాష్ట్ర అసెంబ్లీకి బాంబు బెదిరింపులు వచ్చాయి. గురువారం (మార్చి12) ఉదయం 9 గంటలకు అసెంబ్లీలో బాంబు పెట్టామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఈ మెయిల్స్ పంపించారు.అసెంబ్లీతో పాటు హైకోర్టు, మెట్రో, ఓ బ్యాంకును బాంబుతె పేల్చేస్తామంటూ బెదిరించారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే అసెంబ్లీ ఖాళీ చేయించారు. ఆయా ప్రదేశాలలో భద్రతను పెంచారు.
గురువారం ఉదయం ఇమెయిల్ ద్వారా బాంబు బెదిరింపు అందుకున్న ముంబై విధాన భవన్ వెలుపల భారీగా పోలీసు సిబ్బంది మోహరించారు. అసెంబ్లీతోపాటు, పరిసర ప్రాంతాలను ఖాళీ చేయించారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ తో తనఖీలు చేశారు.
బాంబు బెదిరింపులు రావడంతో ఉదయం 9.45గంటలకు ప్రారంభం కావల్సిన అసెంబ్లీ సమావేశాలు ఆలస్యం అయ్యాయి. అయితే పేలుడుకు సంబంధించిన ఎటువంటి పదార్థాలు లభించలేదని పోలీసులు తేల్చారు.
