రోజుకు మూడు డిగ్రీ ఎగ్జామ్స్‌‌

రోజుకు మూడు డిగ్రీ ఎగ్జామ్స్‌‌

హైదరాబాద్, వెలుగు: లాక్‌‌‌‌డౌన్ సడలింపుల నేపథ్యంలో డిగ్రీ ఎగ్జామ్స్‌‌‌‌పై ఉన్నత విద్యా మండలి దృష్టి పెట్టింది. రోజూ మూడు పూటలా పరీక్షలు పెట్టాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. జూన్ 20 తర్వాత ఫైనలియర్ స్టూడెంట్స్‌‌‌‌కు.. ఆగస్టులో ఫస్టియర్, సెకండియర్ వాళ్లకు ఎగ్జామ్‌‌‌‌ పెట్టాలని భావిస్తోంది.

ఏప్రిల్‌‌‌‌లో జరగాల్సి ఉన్నా..

ఏప్రిల్‌‌‌‌లో జరగాల్సిన డిగ్రీ సెమిస్టర్‌‌‌‌ పరీక్షలు లాక్‌‌‌‌డౌన్ వల్ల వాయిదా పడ్డాయి. అయితే కేంద్రం సడలింపులతో యూజీసీ ఇటీవల 2019–20కి సవరించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. దీంతో రాష్ర్టంలో డిగ్రీ, పీజీ పరీక్షల నిర్వహణపై ఉన్నత విద్యామండలి అధికారులు, వర్సిటీలతో చర్చలు జరుపుతున్నారు. ముందు జూన్‌‌‌‌లో ఫైనలియర్ పరీక్షలు పెట్టాలని నిర్ణయించిన అధికారులు.. అందుకోసం షెడ్యూల్ రెడీ చేసుకోవాలని వర్సిటీలను ఆదేశించారు.

వాల్యుయేషన్‌‌‌‌ కూడా ఫస్ట్‌‌‌‌ ఫైనల్‌‌‌‌ ఇయర్‌‌‌‌వే

పరీక్ష టైమ్‌‌‌‌ 2 గంటలకు కుదించడంతో రోజూ 3 పూటలు బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులకు వేర్వేరుగా పరీక్షలు జరపాలని అధికారులు ఆలోచిస్తున్నారు. బ్యాక్‌‌‌‌ లాగ్ స్టూడెంట్స్‌‌‌‌ను దృష్టిలో పెట్టుకొని ఫస్టియర్, సెకండియర్​వారికీ త్వరగా పరీక్షలు పెట్టబోతున్నారు. ఎక్కువ మంది ఫెయిల్​అయిన సబ్జెక్టులకు ముందు పరీక్షలు పెడతారు. పీజీ, ఇతర పోటీ పరీక్షల కోసం వాల్యూవేషన్​కూడా ఫైనలియర్​వాళ్లవే త్వరగా చేయాలని భావిస్తున్నారు. సోమవారం అన్ని వర్సిటీల ప్రతినిధులతో మరోసారి మండలి అధికారులు సమావేశమయ్యే అవకాశం ఉంది.

హాస్టల్​ స్టూడెంట్స్‌‌‌‌కు ఎట్లా?

స్టేట్‌‌‌‌లోని 52 డిగ్రీ గురుకులాల్లో 9 వేల మంది చదువుతున్నారు. వీళ్లతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలేజీ హాస్టళ్లు, కాలేజీ అటాచ్డ్ హాస్టళ్లు, స్టూడెంట్స్​మేనేజ్‌‌‌‌మెంట్ హాస్టళ్లతో పాటు ప్రైవేటు, కుల సంఘాలకు హాస్టళ్లలోనూ వేలాది మంది ఉన్నారు. లాక్‌‌‌‌డౌన్‌‌‌‌తో ఇవన్నీ మూతబడ్డాయి. జూన్‌‌‌‌లో నిర్వహించే డిగ్రీ పరీక్షల టైమ్‌‌‌‌కైనా ఇవి తెరుచుకుంటాయా లేదా అని అధికారులు సందేహపడుతున్నారు. జూన్​తొలివారంలో వెల్ఫేర్ అధికారులతో మాట్లాడి ఫైనలియర్ వారికి అవకాశమిచ్చేలా చూడాలని నిర్ణయించారు. ఫైనలియర్ వాళ్లకే అవకాశమిస్తే హాస్టల్‌‌‌‌లో భౌతిక దూరం కూడా పాటించొచ్చని ఆలోచిస్తున్నారు. రెసిడెన్షియల్ సొసైటీ సెక్రెటరీ ఆర్‌‌‌‌ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ముందు ఫైనలియర్ వాళ్లకు పరీక్షలు పెట్టాలని విద్యామండలికి లేఖ రాశారు.

కరోనా ఎప్పటికీ మనతోనే