ప్రపంచ అత్యుత్తమ సీఈఓల్లో ముగ్గురు భారతీయులు

ప్రపంచ అత్యుత్తమ సీఈఓల్లో ముగ్గురు భారతీయులు

అంతర్జాతీయ కార్పొరేట్‌ ప్రపంచంలోనూ భారతీయులు తమ సత్తా చాటుతున్నారు. పనితీరుతో తమ కంపెనీలను లాభాల్లో ముందుకు నడిపిస్తున్నారు. ప్రపంచంలోని టాప్‌10 సీఈఓల్లో ఈ ఏడాది ప్రవాస భారతీయులు మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, అడోబ్‌ సీఈఓ శంతను నారాయణ్‌, మాస్టర్‌కార్డ్‌ సీఈఓ అజయ్‌ బంగాకు చోటు దక్కింది. వీరిలో శంతను నారాయణ్‌ ఆరో స్థానం, అజయ్‌ బంగా ఏడో స్థానంలో నిలవగా… సత్య నాదెళ్ల తొమ్మిదో స్థానం దక్కించుకున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్‌ బిజినెస్‌ రివ్యూ పత్రిక ది బెస్ట్‌ పర్‌ఫార్మింగ్‌ సీఈఓస్‌ ఇన్‌ ది వరల్డ్‌, 2019 పేరుతో ఈ జాబితా విడుదల చేసింది. ఎన్‌విడియా కంపెనీ సీఈఓ జెన్‌సెన్‌ హుయాంగ్‌ టాప్‌10 సీఈఓల లిస్టులో అందరికంటే ముందున్నారు. టాప్‌100 CEOల జాబితాలో డీబీఎస్‌ బ్యాంక్‌ సీఈఓ పీయూష్‌ గుప్తాకు 89వ స్థానం లభించింది. ఏటా ఈ జాబితాలో టాప్‌లో ఉండే అమెజాన్‌ సీఈఓ జెఫ్‌ బెజోస్‌కు ఈ ఏడాది చోటు దక్కలేదు.