ఈ ఏడాది 70 వేల మంది .. టెక్ ఉద్యోగులు ఇంటికే

ఈ ఏడాది 70 వేల మంది .. టెక్ ఉద్యోగులు ఇంటికే
  • భారీగా లేఆఫ్స్ చేపడుతున్న గూగుల్‌‌‌‌, అమెజాన్‌‌‌‌, టెస్లా వంటి పెద్ద కంపెనీలు
  • ఒక్క ఏప్రిల్‌‌‌‌లోనే 20 వేల మంది ఔట్‌‌‌‌
  • ఇండియన్ కంపెనీలదీ అదే బాట

న్యూఢిల్లీ: టెక్  ఉద్యోగుల ఇబ్బందులు తగ్గడం లేదు.  ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 70 వేల మంది ఉద్యోగులు తమ జాబ్స్ కోల్పోయారు. ఒక్క ఏప్రిల్‌‌‌‌లోనే  20 వేల మంది ఉద్యోగులను కంపెనీలు ఇంటికి పంపించేశాయి. గూగుల్‌‌‌‌, టెస్లా, యాపిల్ వంటి పెద్ద కంపెనీలు పెద్ద మొత్తంలో ఎంప్లాయీస్‌‌‌‌ను  తీసేస్తున్నాయి.

లేఆఫ్స్ చేపట్టిన టాప్ కంపెనీలు..

1.  తాజాగా 614 మంది ఉద్యోగులను యాపిల్ తీసేసింది.  సెల్ఫ్‌‌‌‌ డ్రైవింగ్‌‌‌‌ కారు ప్రాజెక్ట్‌‌‌‌ క్యాన్సిల్‌‌‌‌ అవ్వడంతో ఈ ప్రాజెక్ట్‌‌‌‌ కోసం పనిచేస్తున్న వారు  జాబ్స్ కోల్పోయారు.  విదేశాల్లో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులు కూడా జాబ్స్ కోల్పోయారని  సంబంధిత వ్యక్తులు పేర్కొన్నారు. 
2. పైతాన్‌‌‌‌, ఫ్లట్టర్‌‌‌‌‌‌‌‌, డార్ట్ టీమ్‌‌‌‌లతో సహా వివిధ సెగ్మెంట్లలో పనిచేస్తున్న ఉద్యోగులను గూగుల్‌‌‌‌ తొలగించింది. రీస్ట్రక్చరింగ్​లో భాగంగా లేఆఫ్స్ చేపడుతున్నామని కంపెనీ స్పోక్స్‌‌‌‌పర్సన్‌‌‌‌ పేర్కొన్నారు. ఇతర విభాగాల్లోని రోల్స్‌‌‌‌ కోసం  వీరు అప్లయ్‌‌‌‌ చేసుకోవచ్చని చెప్పారు. రియల్ ఎస్టేట్‌‌‌‌, ఫైనాన్స్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్లలో పనిచేస్తున్న కొంత మంది ఉద్యోగులను గూగుల్ కిందటి నెలలో తొలగించింది. 
3. క్లౌడ్ కంప్యూటింగ్, సేల్స్‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌, టెక్నాలజీ  విభాగాల్లో పనిచేస్తున్న వందల మంది ఉద్యోగులను అమెజాన్ తొలగించింది. 

4. కాలిఫోర్నియాలోని  హెడ్‌‌‌‌క్వార్టర్‌‌‌‌‌‌‌‌లో పనిచేస్తున్న 62 మంది ఉద్యోగులను ఇంటెల్‌‌‌‌ తొలగించింది. సేల్స్‌‌‌‌, మార్కెటింగ్ విభాగాల్లో పనిచేస్తున్న ఉద్యోగులను తీసేసింది. 
5.   ఇండియన్ కంపెనీ బైజూస్‌‌‌‌  ఈ ఏడాది 500 మంది ఉద్యోగులను తొలగించింది. మొత్తం ఉద్యోగుల్లో ఈ నెంబర్ 3 శాతానికి సమానం. ఫండ్స్ సేకరించడంలో ఈ ఎడ్ టెక్ ఇబ్బందులు పడుతోంది. సేల్స్, మార్కెటింగ్‌‌‌‌, టీచింగ్ విభాగాల్లో పనిచేస్తున్న వారు ఈ లేఆఫ్స్ లిస్టులో ఉన్నారు.  ఈ  కంపెనీ కిందటేడాది 4,500 మందిని తొలగించింది. 
6.  సేల్స్ పడిపోవడంతో టెస్లా తాజాగా 10 శాతం మంది ఉద్యోగులను తీసేసింది.  వివిధ విభాగాల్లో పనిచేస్తున్న వేల మంది తమ జాబ్స్ కోల్పోయారు. 
7. ఓలా క్యాబ్స్‌‌‌‌  తమ మొత్తం ఉద్యోగుల్లో 10 శాతం లేదా 200 మందిని తొలగించే పనిలో ఉంది. కంపెనీ సీఈఓ హేమంత్ భక్షి  తన పదవికి రాజీనామా చేశారు. ఈయన సీఈఓగా బాధ్యతలు తీసుకొని నాలుగు నెలలు కూడా కాలేదు. 
8. బెంగళూరు కంపెనీ హెల్తీఫైమీ  150 మంది ఉద్యోగులను తొలగించింది. కంపెనీ మొత్తం  ఉద్యోగుల్లో ఇది 27 శాతానికి సమానం. సేల్స్, ప్రొడక్ట్ టీమ్‌‌‌‌లలో పనిచేస్తున్నవారిని కంపెనీ తొలగించింది. రీస్ట్రక్చరింగ్‌‌‌‌లో భాగంగా ఉద్యోగులను తొలగించామని హెల్తీఫైమీ పేర్కొంది. 
9. హోమ్‌‌‌‌ అప్లియెన్స్‌‌‌‌లను తయారు చేసే  వర్ల్‌‌‌‌పూల్‌‌‌‌ ఈ ఏడాది 1,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేసింది. ఈ ఏడాది 400 మిలియన్ డాలర్లు ఆదా చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. కిందటేడాది నాటికి వర్ల్‌‌‌‌ఫూల్‌‌‌‌ ఉద్యోగులు గ్లోబల్‌‌‌‌గా 59 వేల మంది ఉన్నారు.  
10. టెలికం కంపెనీ టెలినార్ నార్వేలో 100 మంది ఉద్యోగులను తొలగించింది. రీఆర్గనైజేషన్‌‌‌‌లో భాగంగా టెంపరరీ స్టాఫ్‌‌‌‌ను తీసేస్తోంది.