వినాయక చవితి పండుగ పూట భూపాలపల్లి లో విషాద ఘటన జరిగింది. పగబట్టిన ప్రకృతి.. పిడుగుపాటుకు మహిళా రైతు మృతిచెందింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన జయశంకర్భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది.
భూపాలపల్లి మండలంలోని శ్యామ్ నగర్ గ్రామానికి చెందిన పొనగంటి సులోచన(44) అనే మహిళా రైతు కూలి వ్యవసాయ పనుల నిమిత్తం మిరప నారు పనులు చేసేందుకు పొలానికి వెళ్లింది. భారీ వర్షం కురుస్తుండగా పిడుగుపడటంతో తీవ్ర గాయాలపాలై... అక్కడికక్కడే మృతి చెందింది. అయితే అక్కడే పని చేస్తున్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికులతోపాటు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు.మృతురాలు సులోచనకు భర్త , కూతురు, ఓ కుమారుడు ఉన్నారు.
ALSO READ | తెలంగాణలో మూడు రోజుల పాటు వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక