వామ్మో.. ఏకంగా 220 కేజీలు ఎత్తిన బాలీవుడ్ హీరో

వామ్మో.. ఏకంగా 220 కేజీలు ఎత్తిన బాలీవుడ్ హీరో

టైగర్ ష్రాఫ్..బాలీవుడ్ కు ఈ పేరు సుపరిచితమే..ఫిట్ నెస్ కు పెట్టింది పేరు టైగర్ ష్రాప్. భారీ కండలతో ,ఫిట్ నెస్ తో పాటు అదిరిపోయే డ్యాన్స్ లతో అందరి దృష్టిని ఆకర్షించాడు టైగర్ ష్రాఫ్. తక్కువ టైంలోనే చాలా పాపులారిటీ సంపాదించుకున్నాడు. లాక్ డౌన్ లో పూర్తయ్యాక షూటింగ్ లు మొదలు కావడంతో తన ఫిట్ నెస్ పై మళ్లీ దృష్టి పెట్టిన టైగర్ ష్రాఫ్  తన జిమ్ లో  వర్కవుట్ వీడియోలను ఇన్ స్టాగ్రమ్ లో పోస్ట్ చేశాడు. అయితే ఈ వీడియో ఏకంగా 220 కేజీల వెయిట్ లిఫ్ట్ ను ఎత్తి అందరిని షాక్ కు గురి చేశాడు. ఫస్ట్ ఎంత ట్రై చేసినా బరువును లేపలేకపోయాడు.. మళ్లీ ట్రై చేయగా తన మోకాళ్ల వరకు 220 కేజీల బరువును లేపి ఔరా అనిపించాడు.

సోషల్ మీడియాలో ఈ కండల వీరుడికి తెగ కామెంట్లు పడుతున్నాయి. భారీగా లైక్ లు వస్తున్నాయి. ఒక్కరోజులో 4 మిలియన్లకు పైగా లైకులు వచ్చాయి. ఇన్ స్టాగ్రమ్ లో మనోడికి  25 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. టైగర్ ష్రాఫ్ ప్రెజెంట్ హీరో పంటి 2లో నటిస్తున్నాడు.

ఒక్కరోజే 78,357 కేసులు..1045 మరణాలు

ఫ్యాన్స్ కు బర్త్ డే సర్ ఫ్రైజ్.. వకీల్ సాబ్ బొమ్మ అదిరింది

తెలంగాణలో కొత్తగా 2,892 కరోనా పాజిటివ్ కేసులు