ఎయిర్ఫోర్స్ డ్రెస్తో పరేడ్ గ్రౌండ్లోకి.. ఫొటోలు దిగుతుంటే నిలదీశారు.. ఎవరో తెలిసి విస్తుపోయిన ఆర్మీ అధికారులు

ఎయిర్ఫోర్స్ డ్రెస్తో పరేడ్ గ్రౌండ్లోకి.. ఫొటోలు దిగుతుంటే నిలదీశారు.. ఎవరో తెలిసి విస్తుపోయిన ఆర్మీ అధికారులు

సికింద్రాబాద్: బేగంపేట్లో నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారి ఘటన కలకలం రేపింది. పరేడ్ గ్రౌండ్ లోపలకి ఫ్లైయింగ్ అధికారి డ్రెస్లో వెళ్లిన ఈ అగంతక వ్యక్తి అక్కడ ఫోటోలు దిగుతూ సంచరించాడు. దీంతో.. మిలటరీ అధికారులకు అనుమానం వచ్చి తనిఖీ చేశారు. నకిలీ ఎయిర్ ఫోర్స్ అధికారిగా గుర్తించారు. బీహార్కు చెందిన నితీష్ కుమార్ పాల్ నేరెడ్ మెట్లో నివాసం ఉంటున్నాడు.

ఎయిర్ ఫోర్స్ అధికారి పేరుతో అమ్మాయిలకు వల వేస్తున్న ఈ కేటుగాడు తాను ఎయిర్ ఫోర్స్ అధికారి నంటూ ఇన్ స్టాగ్రామ్లో ప్రొఫైల్ క్రియేట్ చేశాడు. ఇతనిని అదుపులోకి తీసుకున్న ఆర్మీ అధికారులు బేగంపేట్ పోలీసులకు అప్పగించారు. బేగంపేట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.