షాద్ నగర్, వెలుగు: షాద్నగర్లో మున్సిపల్ ఎన్నికలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ విజయ్ కుమార్ తెలిపారు. మున్సిపాలిటీలో 11 రూట్లలో మొత్తం 76 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, వీటిలో 7 సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లున్నాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు 32 మంది రౌడీషీటర్లను బైండోవర్ చేశామని, 11 ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామన్నారు.
