టిక్ టాక్ ఎఫెక్ట్.. హాస్పిటల్స్‌లో సెల్ ఫోన్లు నిషేధం

టిక్ టాక్ ఎఫెక్ట్.. హాస్పిటల్స్‌లో సెల్ ఫోన్లు నిషేధం

మల్కన్ గిరి DHHలో నలుగురు నర్సులు తీసుకున్న టిక్ టాక్ వీడియోలు ఇటీవల బాగా వైరల్ అయ్యాయి. హాస్పిటల్ క్రిటికల్ కేర్ యూనిట్లలో పేషెంట్స్ ను అనుక్షణం చూసుకోవాల్సిన నర్సులు… పిచ్చి పిచ్చి ఎక్స్ ప్రెషన్స్ తో.. డాన్సులు చేస్తూ.. వీడియోలు తీసుకున్నారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. వారికి వెంటనే సుదీర్ఘ సెలవుపై పంపించేసింది హాస్పిటల్ ఉన్నతాధికారులు.

దీంతో.. ఒడిశా ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. మల్కన్ గిరి జిల్లా పరిపాలన విభాగం అత్యవసర ఆదేశాలు ఇచ్చింది. హాస్పిటల్స్ లోని క్రిటికల్ కేర్ యూనిట్లలో సెల్ ఫోన్లను నిషేధిస్తూ ఆర్డర్స్ పాస్ చేసింది. ICU, SNCU, OT, లేబర్ రూమ్స్ లో నర్సులు, ఉద్యోగులు సెల్ ఫోన్లు వాడొద్దని ఆదేశాలు జారీచేసింది.