‘కస్టడీ’..లవ్ ఎట్ ఫస్ట్ సైట్

‘కస్టడీ’..లవ్ ఎట్ ఫస్ట్ సైట్

నాగచైతన్య, కృతీశెట్టి జంటగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కస్టడీ’. శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే  ఫస్ట్ సాంగ్‌‌‌‌తో ఆకట్టుకున్న టీమ్.. ఆదివారం ‘టైమ్ లెస్ ట్రాక్’ పేరుతో రెండో పాటను రిలీజ్ చేసింది. ఈ రెట్రో థీమ్ మెలోడీని ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కంపోజ్ చేయగా రామజోగయ్య శాస్త్రి క్యాచీ లిరిక్స్ రాశారు. యువన్ శంకర్ రాజా, కపిల్ కపిలన్ కలిసి పాడారు.

‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే అయ్యిందలా.. చూస్తూనే ఎంతో నచ్చేసిందా బుజ్జి పిల్లా.. చక్రలా కళ్లు.. ముత్యాల పళ్లు నవ్వుకు పడిపోయా’ అంటూ సాగే పాటలో చైతూ, కృతీ వింటేజ్ లుక్స్‌‌‌‌లో మెస్మరైజ్ చేస్తున్నారు. ఈ పాట కోసం ఏడు భారీ సెట్స్ వేసినట్టు తెలియజేశారు మేకర్స్. అరవింద్ స్వామి, ప్రియమణి, శరత్‌‌‌‌ కుమార్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం  మే 12న  తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.