తెలుగు సరికొత్త క్రైమ్ కామెడీ.. గన్స్, గోల్డ్ బ్యాక్డ్రాప్లో బా బా బ్లాక్ షీప్.. ఒక్క రోజులో జరిగే కథతో!

తెలుగు సరికొత్త క్రైమ్ కామెడీ.. గన్స్, గోల్డ్ బ్యాక్డ్రాప్లో బా బా బ్లాక్ షీప్.. ఒక్క రోజులో జరిగే కథతో!

మేఘాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో సంపూర్ణంగా షూటింగ్ జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రుపుకుంటున్న తొలి సినిమా ‘బా బా బ్లాక్ షీప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ’ అని అన్నారు నిర్మాత వేణు దోణెపూడి. ఆయన నిర్మాతగా గుణి మంచికంటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో టిను ఆనంద్, ఉపేంద్ర, జార్జ్ మరియన్, అక్షయ్ లగుసాని, విష్ణు, కార్తికేయ, విస్మయశ్రీ, మాళవి  ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. సాహో', 'సలార్', 'యానిమల్' వంటి పాన్ ఇండియా హిట్ సినిమాల్లో నటించిన ఆర్టిస్టులతో సరికొత్త క్రైమ్ కామెడీ వస్తుండటం విశేషం. 

శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ప్రస్తుతం మేఘాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌య‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో షూటింగ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ ‘గన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, గోల్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, హంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నేపథ్యంలో ఒక రోజులో జరిగే కథతో ఈ క్రైమ్ కామెడీ మూవీని తెరకెక్కిస్తున్నాం.

ఈస్ట్ ఇండియా బ్యాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డ్రాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో జ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పాతాలు, కొండ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, అంద‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మైన ప్రదేశాల్లో సాగే క‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌థ ఇది. దీంతో కథకు మేఘాల‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యా ప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ర్ఫెక్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా సెట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతుందని భావించి అక్కడ షూటింగ్ చేస్తున్నాం. తప్పకుండా ప్రేక్షకులకు కనువిందు చేసే సినిమా అవుతుంది’ అని అన్నారు.