Vaibhav Sooryavanshi Debut: భారత జట్టు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీని ఐర్లాండ్ పర్యటనలో తుది జట్టులోకి తీసుకోకపోవడంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండియన్ టీమ్ లోకి తొలిసారి పిలుపు అందుకున్న 15 ఏళ్ల వైభవ్, వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ బెంచ్‌కే పరిమితం కావడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ఓపెనర్లు సంజు శాంసన్, అభిషేక్ శర్మలు అద్భుత ఫామ్‌లో ఉండటంతో ఈ నిర్ణయం సమర్థనీయమే అయినప్పటికీ, ఐర్లాండ్ సిరీస్‌లో భారత బ్యాటింగ్ ఘోరంగా విఫలమై 2–0తో సిరీస్ ఓడిపోయింది.
అతడ్ని బెంచ్‌పై కూర్చోబెడతారా?:
గత 12 నెలలుగా వైభవ్ సూర్యవంశీ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని రవిశాస్త్రి గుర్తు చేశారు. ముఖ్యంగా ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లను సైతం చితక్కొడుతూ ఏకంగా 776 రన్స్ సాధించి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడని పేర్కొన్నారు. అంతటి ఫామ్‌లో ఉన్న ప్లేయర్‌ను ఐర్లాండ్ టూరులో ఆడించి ఉంటే, అక్కడి చిన్న మైదానాల్లో ప్రత్యర్థి బౌలింగ్‌ను ముక్కలు ముక్కలు చేసేవాడని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు.
రవిశాస్త్రి తనదైన శైలిలో కామెంట్స్:
ఐర్లాండ్ సిరీస్‌లోనే వైభవ్ సూర్యవంశీ కచ్చితంగా ఆడాల్సింది.. అక్కడ పిచ్‌లు చాలా స్లోగా, స్పాంజీగా ఉన్నాయి, పైగా గ్రౌండ్ కూడా చాలా చిన్నది.. అతను గనుక బరిలోకి దిగి ఉంటే బంతిని స్టేడియం బయటకి బాదేవాడు.. ప్రత్యర్థి బౌలర్ల ప్యాంట్లు ఊడదీసేలా ఆడి ఉండేవాడని పేర్కొన్నాడు. ఇప్పుడు ఇంగ్లాండ్ సిరీస్‌లో అతనికి అవకాశం ఇస్తారో లేదో నాకు తెలియదు.. కానీ అతనికి వీలైనంత త్వరగా జట్టులో ఛాన్స్ ఇవ్వాలి.. ఐపీఎల్‌లో అతను ఏ ఫాస్ట్ బౌలర్‌ను వదిలిపెట్టలేదు.. అలాంటి ఆటగాడిని తెచ్చి మీరు బెంచ్ పై కూర్చోబెడతారా? అని మండిపడ్డాడు.
►ALSO READ | శ్రీలంకతో భారత్ టెస్ట్ సిరీస్.. తేదీలు, టైమింగ్స్ ప్రకటించిన బీసీసీఐ!
అతనే టీమిండియా ఎక్స్-ఫ్యాక్టర్:
వైభవ్ సూర్యవంశీ భారత జట్టుకు ఒక ఎక్స్-ఫ్యాక్టర్.. అతని కోసం జట్టులో ఎలాగైనా స్థానం కల్పించాలని రవిశాస్త్రి మేనేజ్‌మెంట్‌కు సూచించారు. కేవలం 15 ఏళ్ల వయసున్న వైభవ్‌కు ఎలాంటి ముందస్తు అంచనాల ఒత్తిడి, యువ రక్తం కావడంతో అతను మైదానంలో నిర్భయంగా ఆడతాడని కొనియాడారు. అతను గనుక క్రీజులో నిలదొక్కుకుని మొదటి 2, 3 ఓవర్లు ఆడితే, మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు భారీ స్కోర్లు చేయడానికి అవసరమైన బలమైన పునాదిని ఓపెనింగ్‌లోనే అందిస్తాడని రవిశాస్త్రి గట్టిగా చెప్పారు.
"Arrey, woh khelna chahiye tha yaar!" 👀
— Sony Sports Network (@SonySportsNetwk) July 1, 2026
Ravi Shastri's brutally honest take on Vaibhav Sooryavanshi 💬
Watch #ENGvIND, 2nd T20I on 4th July, 6 PM onwards, LIVE on Sony Sports Network TV channels.#SonySportsNetwork #MamlaPersonalHai #ExtraaaInnings pic.twitter.com/0S9yMguEig
