మాదాపూర్, వెలుగు: ముందు వెళుతున్న టిప్పర్ సడెన్‌గా యూటర్న్ తీసుకోవడంతో బైక్ ఢీకొని ఓ యువకుడు చనిపోయాడు. ఈ ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం జరిగింది. హనుమకొండకు చెందిన వేముల రవిచంద్ర(25) బండ్లగూడలో ఉంటూ హోటల్‌లో అసిస్టెంట్ చెఫ్‌గా పనిచేస్తున్నాడు.
ఆదివారం మధ్యాహ్నం బైక్‌పై గచ్చిబౌలి వెళ్తుండగా అర్బార్స్కూల్వద్ద ముందు వెళుతున్న టిప్పర్సడెన్గా యూటర్న్ తీసుకుంది. ఈక్రమంలో రవిచంద్ర బైక్. టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. తలకు తీవ్ర గాయాలై స్పాట్‌లోనే చనిపోయాడు. గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు.
