సంక్రాంతికి ఇంటి ముస్తాబు

సంక్రాంతికి ఇంటి ముస్తాబు

అన్ని పండుగల్లో సంక్రాంతి సమ్​థింగ్​ స్పెషల్​. భోగి, సంక్రాంతి, కనుమ అంటూ మూడు రోజులు  సంతోషాల్ని నింపుతుంది. కానీ, ఈసారి కొవిడ్ వల్ల ఎక్కువమంది ఒక దగ్గర చేరి పండుగ చేసుకునే పరిస్థితి లేదు. అందుకని, ఇంట్లోనే ఆత్మీయులతో గ్రాండ్​గా సెలబ్రేట్​ చేసుకోవాలి. మరి ఫెస్టివ్​ లుక్​ మాటేంటి అంటారా! అందుకోసమే ఈ టిప్స్​ . 

పండుగంటే  సంబరాలు, సంతోషాలతో పాటు బోలెడు కబుర్లు కూడా. అంతా ఒకచోట చేరినప్పుడు కబుర్లతోనే కాలం గడిచిపోతుంది.అందుకే నలుగురూ కలిసి హాయిగా మాట్లాడుకోవడానికి చెక్క బెంచీలు, బల్లలు వేయాలి. వాటి మీద కుషన్స్​ లేదా కలర్​ఫుల్​ దుపట్టాలు వేస్తే లుక్​ బాగుంటుంది. అంత స్పేస్​ లేదా... అయితే నేలమీద  చాపలు పరిచి, పరుపు వేయాలి. నాలుగువైపులా పూల మొక్కలు పెట్టి, గోడలకి లాంతర్లు వేలాడదీస్తే వింటేజ్​ లుక్​ వస్తుంది. 

బంతులు, చామంతులు ఇంటి గుమ్మానికి వేలాడదీస్తే పండుగ కళ నడిచొస్తుంది. అయితే ఎప్పటిలా రొటీన్​గా కాకుండా .. డిఫరెంట్​ షేప్స్​లో వీటిని గుమ్మానికి అలంకరించాలి . అంటే మామిడి ఆకుల అంచున బంతి పువ్వులు గుచ్చాలి.  లేదా నాలుగైదు మామిడాకుల్ని ఒకదానిపై  ఒకటి పువ్వులా  పేర్చి వాటిపైన బంతిపువ్వులు గుచ్చి గుమ్మానికి వేలాడదీయాలి.  గుమ్మానికి రెండువైపులా, ఇంట్లో   అక్కడక్కడా నీటి తొట్టెలు పెట్టి  వాటిల్లో బంతిపూలు పరిస్తే ఫెస్టివల్​ మరింత కలర్​ఫుల్​గా ఉంటుంది. బంతిపూలతో ‘హ్యాపీ సంక్రాంతి’ అని గుమ్మం ముందు రాయొచ్చు కూడా. అలాగే డైనింగ్ టేబుల్​  మధ్యలో ఫ్లవర్ వేజ్​లు పెడితే లుక్ బాగుంటుంది, 

సంక్రాంతికి  దీపాల వెలుగులు లేకపోతే ఎలా? పండుగకి ఒకట్రెండురోజులు ముందుగానే ఎలక్ట్రికల్​ లైట్స్​ పెట్టించుకోవాలి. ఇంటి ఎంట్రన్స్​లో లైట్స్​ పెడితే పండుగకి కొత్త కళ వస్తుంది.  స్ట్రింగ్​ లైట్స్​ని లివింగ్​, బెడ్​ రూమ్​లలో వేలాడదీస్తే  ఎలిగెంట్​లుక్​ వస్తుంది. పేపర్ లాంతర్లు, ఎగ్​ కార్డన్​ లాంప్స్,  సీ షెల్​ లైట్స్​ని కూడా ఫెస్టివల్​ డెకరేషన్​లో యాడ్​ చేయొచ్చు. అంత ఖర్చు వద్దనుకుంటే గ్లాస్​ జార్స్​లో లైట్స్​ని అమర్చొచ్చు.  వాటిల్లో  క్యాండిల్స్​ పెట్టినా మంచి లుక్​ వస్తుంది. అలాగే గ్లాస్​ జార్స్​లో ఎండుటాకులు కూడా వేసి టీపాయ్​ మీద పెట్టొచ్చు. గ్లాస్​ జార్స్​పై నక్షత్రం షేప్​లో ఉండే  రేడియం స్టిక్కర్స్​ ​  కూడా అతికించొచ్చు. అలాగే గార్డెన్​లో లైట్స్​తో పాటు షేడెడ్​ కానోపీస్​ని పెట్టాలి. 

పతంగులతో ఇంటీరియర్​లో పనిలేదనుకుంటే పొరపాటే. ఫెస్టివ్​ లుక్​కి వీటిని మించిన డెకరేటివ్​ పీస్​ మరొకటి లేదు. రంగురంగుల గాలిపటాల్ని ఇంటి గుమ్మం చుట్టూ అతికించొచ్చు. లివింగ్​ రూమ్​ గోడలపై డిఫరెంట్​ షేప్స్​ గాలిపటాల్ని  వరుసగా  పేర్చినా లుక్​ బాగుంటుంది. అయితే డెకరేషన్​కి డిఫరెంట్​ కలర్స్ ఉన్న పతంగుల్ని ఎంచుకోవాలి. కలర్​ కాంబినేషన్​ని సెట్​ చేసుకొని గోడలకి అతికించాలి.  అరటి ఆకుల్ని గోడలపై అతికించి.. వాటి మీద గాలిపటాల్ని అమర్చినా బాగుంటుంది. బయట కొనడం ఇష్టం లేకపోతే ఇంట్లోనే పేపర్​ని గాలిపటంలా కత్తిరించి అతికించొచ్చు. అలాగే భోగి మంటలు వేసేచోట  కూడా కైట్స్​తో  ఆర్చ్​ ఏర్పాటు చేసుకోవచ్చు.  ఇంటి బాల్కనీకి గాలి పటాల్ని వేలాడదీసినా లుక్​ బాగుంటుంది. 

సంక్రాంతి అంటేనే రంగుల ముగ్గులు. ఇంటి  వాకిట్లో, గుమ్మం ముందు  వేసే ముగ్గుల్ని హాల్లోకి  కూడా తీసుకురావచ్చు. అయితే పెద్దపెద్ద ముగ్గులకి బదులు సింపుల్​గా, రంగులద్దడానికి అనువుగా ఉండే ముగ్గులు చూడ్డానికి బాగుంటాయి. వాటి మీద  భోగి కుండలు  పెడితే స్పెషల్​ లుక్​ వస్తుంది. అయితే భోగి కుండల్ని కాస్త కలర్​ఫుల్​గా డెకరేట్​ చేయాలి. వాటి చుట్టూరా పెయింటింగ్స్​ వేయాలి. లేదంటే వాటిపై సున్నంతో  ముగ్గులు వేసినా, వాటి చుట్టూరా బంతిపూల మాల చుట్టినా ఫెస్టివ్​ లుక్​ వస్తుంది. వాటిల్లో చెరకు గడలు కూడా పెట్టుకోవచ్చు.