దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతున్నా : టీజేఎస్ చీఫ్ కోదండరాం

దేశవ్యాప్త సమ్మెకు మద్దతు తెలుపుతున్నా : టీజేఎస్ చీఫ్ కోదండరాం

హైదరాబాద్, వెలుగు: కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 12న కార్మిక సంఘాలు చేస్తున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు మద్దతు ఇస్తున్నామని టీజేఎస్  చీఫ్  కోదండరాం తెలిపారు.  కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్​లను రద్దుచేయాలని దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు కోరుతున్నాయని మంగళవారం ఒక ప్రకటనలో ఆయన పేర్కొన్నారు.

ఎన్నో ఏండ్ల పోరాటాల ద్వారా కార్మికుల సంక్షేమం కోసం సాధించుకున్న చట్టాలను బలహీనపరుస్తూ, కార్మికుల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీసేలా లేబర్ కోడ్‌‌‌‌లు తెచ్చారని మండిపడ్డారు. కార్పొరేట్  సంస్థలకు లబ్ధి చేకూర్చే విధానాలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో పాల్గొంటామని తెలిపారు. ముఖ్యంగా సింగరేణి కార్మిక సంఘం, మున్సిపల్,  ఇతర అనుబంధ కార్మిక సంఘాలు ఈ సమ్మెలో చురుకుగా పాల్గొనాలని కోరారు.