మునుగోడు ఉపఎన్నిక : బుద్ధ భవన్ ముందు కోదండరాం మౌనదీక్ష

మునుగోడు ఉపఎన్నిక : బుద్ధ భవన్ ముందు కోదండరాం మౌనదీక్ష

మునుగోడులో పలు పార్టీల నాయకులు అక్రమాలకు పాల్పడుతూ ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తున్నారని ఈసీకి టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం ఫిర్యాదు చేశారు. ఎన్నికల నియమాల ఉల్లంఘనలపై బుద్దభవన్ ముందు ఆయన మౌన దీక్ష చేశారు. మునుగోడు ఉపఎన్నికలో విచ్చలవిడిగా మద్యం, డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మునుగోడు ఉపఎన్నిక సమీపిస్తుండడంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. ఈ ఉపఎన్నిక ప్రధాన పార్టీలకు కీలకంగా మారింది. దీంట్లో విజయం సాధిస్తే..రాబోయే ఎన్నికలపై ఆ ప్రభావం తప్పనిసరిగా ఉంటుందని భావిస్తున్నాయి. ఈ క్రమంలో మునుగోడును సీటును గెలుచుకునేందుకు అన్ని పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నిక బరిలో మొత్తం 47 మంది అభ్యర్థులు ఉన్నారు. నవంబర్ 3వ తేదీన ఉప ఎన్నిక జరగనుండగా, 6వ తేదీన ఫలితాన్ని వెల్లడిస్తారు. టీఆర్ఎస్ పార్టీ నుండి అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, బీజేపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్రవంతి, బీఎస్పీ నుంచి అందోజు శంకరాచారి, టీ‌జే‌ఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్ బరిలో ఉన్నారు.