ముషీరాబాద్, వెలుగు: తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం. నరసయ్య పిలుపునిచ్చారు. ముషీరాబాద్ కన్వీనర్ మెరుగు శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో శుక్రవారం రాంనగర్ చౌరస్తాలో ప్లీనరీ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రొఫెసర్ కోదండరాం నాయకత్వంలో జరగనున్న 4వ ప్లీనరీలో కీలక రాజకీయ, విధానపరమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. ముషీరాబాద్ నియోజకవర్గం నుంచి ప్రజలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావాలని కోరారు.

