
మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద హత్యాయత్నం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు టీజీవో అధ్యక్షురాలు మమత. ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ జరిపి కుట్రదారులను శిక్షించాలని డిమాండ్ చేశారు. శ్రీనివాస్ గౌడ్ పై హత్యాయత్నానికి నిరసనగా రేపటి నుంచి మూడు రోజుల పాటు ప్రభుత్వ ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరవ్వాలని పిలుపునిచ్చారు. దాడికి నిరసనగా కుట్రదారుల దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని డీజీపీకి పిర్యాదు చేస్తామన్నారు. శ్రీనివాస్ గౌడ్ పై కొంతమంది కక్ష కట్టారని అన్నారు టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు రాజేందర్. రాజకీయంగా ఎదుర్కొలేక ఇతర రాష్ట్రాల నుంచి కిరాయి గూండాలకు సూపారీలు ఇస్తున్నారని ఆరోపించారు.
మరిన్ని వార్తల కోసం