నేటి నుంచి సీరియల్స్ షూటింగ్స్ కి ఓకే

నేటి నుంచి సీరియల్స్ షూటింగ్స్ కి ఓకే
  • కండిషన్ల మేరకేనని స్పష్టం చేసిన సీఎం పళనిస్వామి

చెన్నై: లాక్​డౌన్ రూల్స్ సడలింపుల్లో భాగంగా ఎంటర్​టైన్ మెంట్ రంగంలో షూటింగ్​లకు తమిళనాడు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఇప్పటికే లాక్ డౌన్ 5 రూల్స్, గైడ్ లైన్స్ విడుదల చేసిన పళనిస్వామి ప్రభుత్వం నేటి(ఆదివారం) నుంచి సీరియల్స్ షూటింగ్స్ జరుపుకోవచ్చని ప్రకటించింది. అయితే, మ్యాగ్జిమమ్ 60 మందితో టెలివిజన్ షోల షూటింగ్​లను ప్రారంభించాలని కండిషన్ పెట్టింది. గరిష్టంగా 20 మందితో టీవీ కార్యక్రమాల ఇండోర్​ షూటింగ్ కు ప్రభుత్వం ఇప్పటికే అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఫెఫ్సీ అధ్యక్షుడు, బుల్లితెర నిర్మాత మండలి సభ్యుల విజ్ఞప్తుల మేరకు 60 మంది సభ్యులతో సీరియల్స్ షూటింగులు జరుపుకోవడానికి సీఎం తాజాగా అనుమతించారు. షూటింగ్ స్పాట్​లో హ్యాండ్ వాష్​, మాస్కులు కట్టుకోవడం, టెంపరేచర్ టెస్ట్ చేసిన తర్వాతే ప్రతి ఒక్కరినీ లోనికి అనుమతించేలా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. వెహికల్స్ తో పాటు షూటింగ్ జరుగుతున్న ప్రాంతాన్ని కూడా శానిటైజ్ చేయాలని చెప్పారు.