లోపల సీఎం ఉన్నరట... 100 మందికే విజిటర్స్​ పాస్​లు

లోపల సీఎం ఉన్నరట... 100 మందికే విజిటర్స్​ పాస్​లు

తెలంగాణ కొత్త సచివాలయం వివాదాలకు నిలయంగా మారుతోంది. ఇప్పటికే మీడియాకు నో ఎంట్రీ అన్న ప్రభుత్వం  ఇప్పుడు మరో అపవాదు మూటగట్టుకుంది. కొత్త సచివాలయాన్ని చూసేందుకు రోజుకు 300 మంది విజిటర్స్​కు పాస్​లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అయితే మే2 వ తేదీ నుంచి విజిటర్స్​ పాస్​లు ఇస్తామని ప్రకటించారు.  

ఈ రోజు ( మే2)  కొత్త సచివాలయాన్ని చూసేందుకు కొంతమంది విజిటర్స్ వచ్చారు. అధికారులు 100 మందికే ఇచ్చారు.  ప్రస్తుతం లోపల  సీఎం ఉన్నారని .. ఇంతకు మించి పాస్​లు ఇచ్చేందుకు కుదరదని అధికారులు తెగేసి చెబుతున్నారు.

పేదల ప్రభుత్వమని చెప్పే కేసీఆర్​...ఆయన సచివాలయంలో ఉండగా సామాన్యులకు ప్రవేశం లేదా కొంతమంది చర్చించుకుంటున్నారు. ప్రజల ఓట్లతో గద్దెనెక్కి... ప్రజా సొమ్ముతో నిర్మించిన సెక్రటేరియేట్​ను కనీసం చూసేందుకు కూడా అనుమతి లేదా ప్రజలు వాపోతున్నారు.  కేసీఆర్​ ఉంటే సచివాలయంలోకి విజిటర్స్​ను ఎందుకు అనుమతించరని ప్రశ్నిస్తున్నారు.