రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు వర్షాలు

రాష్ట్రంలో పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. హైదరాబాద్ నగరంతో పాటు పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పింది. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు చెప్పారు.

మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట్, జనగాం, నాగర్ కర్నూల్, వనపర్తి, నల్గొండ, హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిస్తాయని చెప్పారు. దక్షిణ, సెంట్రల్ తెలంగాణ జిల్లాలను వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ద్రోణి ప్రభావంతో ఉరుములు మెరుపులతో వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.