టోక్యో ఒలింపిక్స్‌లో భారత మహిళల హాకీ టీమ్ దుమ్మురేపుతోంది. తమ కంటే బలమైన ప్రత్యర్థులను మట్టికరిపిస్తూ క్వార్టర్స్‌కు దూసుకొచ్చిన ఇండియా.. కీలకమైన మ్యాచ్‌లో ఫేవరెట్స్ ఆస్ట్రేలియాను కంగుతినిపించింది. మూడు సార్లు చాంపియన్స్ అయిన ఆసీస్‌పై చారిత్రాత్మక విజయం సాధించిన భారత్.. తొలిసారిగా సెమీస్‌లోకి సగర్వంగా దూసుకెళ్లింది. భారత తరఫున గుర్జీత్ కౌర్ 22వ నిమిషంలో గోల్ చేసింది. మ్యాచ్ మొత్తం మీద నమోదైన ఏకైక గోల్ ఇదే కావడం విశేషం. ఇండియా గోల్ కీపర్ సవిత గోడలా అడ్డు నిలిచి ఆసీస్ గోల్ యత్నాలను తిప్పికొట్టింది. సెమీస్‌లో వరల్డ్ నంబర్ 2 అర్జెంటీనాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఫైనల్‌కు చేరుతుంది. ఓడిన జట్టు కాంస్య పతకం కోసం మరో టాప్ 4 టీమ్‌తో తలపడాల్సి ఉంటుంది.
