ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నీరజ్ చోప్రా

ప్రతిష్టాత్మక అవార్డు రేసులో నీరజ్ చోప్రా

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ గెలిచి చరిత్ర సృష్టించిన నీరజ్ చోప్రా ప్రతిష్టాత్మక లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డుకు నామినేట్ అయ్యాడు. 24 ఏళ్ల ఈ ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్.. 2022 ఏడాదికి గానూ లారియస్ బ్రేక్త్రూ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో ఆరుగురు నామినీల్లో ఒకడిగా ఉన్నాడు. నీరజ్ ను మినహాయిస్తే ఈ పురస్కారం రేసులో ఆస్ట్రేలియన్ ఓపెనర్ రన్నరప్ మెద్వెదేవ్, బ్రిటిష్ టెన్నిస్ స్టార్ ఎమ్మా రడుకను, స్పెయిన్ ఫుట్ బాలర్ పెడ్రీ, వెనిజులా అథ్లెట్ యులిమర్ రోజస్ తోపాటు ఆసీస్ స్విమ్మర్ అరియార్నే టిట్మస్ పోటీపడుతున్నారు. ఈ అవార్డు నామినేషన్స్ కు ఎంపికవ్వడంపై నీరజ్ చోప్రా హర్షం వ్యక్తం చేశాడు. తనతోపాటు అవార్డు రేసులో ఉన్న మిగతా క్రీడాకారులకు అతడు అభినందనలు తెలిపాడు. 

కాగా, లారియస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డు నామినేషన్స్ కు భారత్ తరఫున ఎంపికైన మూడో అథ్లెట్ నీరజ్ చోప్రా కావడం గమనార్హం. ఇంతకు ముందు ఈ అవార్డు నామినేషన్స్ కు 2019లో రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఎంపికవ్వగా.. క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూడా పురస్కార నామినేషన్స్ కు సెలెక్ట్ అయ్యాడు. 2000–2020 కాలానికి గానూ ప్రకటించిన లారియస్ స్పోర్టింగ్ మూమెంట్ అవార్డును సచిన్ గెల్చుకోవడం విశేషం. 

మరిన్ని వార్తల కోసం:

మీ దాగుడుమూతల పర్యటనలతో ఒరిగేదేమిటి?

క్రీజులో కుదురుకుంటే అతడ్ని ఆపడం కష్టం

చింతామణి నాటక నిషేధపై హైకోర్టు సీరియస్