మెడికల్ షాపుల్లో అక్రమాలపై.. కంప్లైంట్​కు టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌

మెడికల్ షాపుల్లో అక్రమాలపై.. కంప్లైంట్​కు టోల్‌‌ ఫ్రీ నంబర్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో నిషేధిత డ్రగ్స్ అమ్మకం, కొనుగోలు, మెడికల్ షాపుల్లో అక్రమాలపై ఫిర్యాదులు చేయడానికి టోల్‌‌ఫ్రీ నంబర్‌‌‌‌ను (180059 96969) ఏర్పాటు చేశామని డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ జనరల్ కమలాసన్ రెడ్డి సోమవారం ప్రకటించారు. 

మెడికల్ షాపుల్లో అధిక ధరలు వసూలు చేయడం, కొనుగోలు చేసిన మెడిసిన్స్‌‌కు బిల్స్ ఇవ్వకపోవడం, నకిలీ మందులు అమ్మడం, క్వాలిటీ లేని మందులు అమ్మడం వంటి అన్ని రకాల విషయాలను టోల్​ఫ్రీ నంబర్‌‌‌‌ ద్వారా తమ దృష్టికి తీసుకు రావాలని కోరారు.