హైదరాబాద్ టూ రామగుండం ప్రయాణికులకు రాజీవ్ రహదారిపై ప్రయాణం ఇక మరింత భారం కానుంది. ఈ హైవేపై ఉన్న టోల్ ప్లాజాలలో వాహనదారుల జేబులకు చిల్లు పడేలా టోల్ రేట్లను ఏకంగా పది శాతం మేర పెంచేశారు.
హైదరాబాద్ నుంచి రామగుండం వరకు ఉన్న206 కిలోమీటర్ల రాజీవ్ రహదారిపై... సిద్దిపేట జిల్లా దుద్దెడ, కరీంనగర్ జిల్లా రేణిగుంట, అలాగే పెద్దపల్లి జిల్లా బసంతనగర్ వద్ద ఉన్న టోల్ ప్లాజాల్లో ఈ పెంచిన ధరలు జూన్ 1 నుంచే అమలులోకి వచ్చాయి.
►ALSO READ | తెలంగాణ సీఐడీ భారీ ఆపరేషన్.. రూ. 100 కోట్ల ఆన్‌లైన్ బెట్టింగ్ గుట్టురట్టు
దీంతో కార్లు, బస్సులతో పాటు హెవీ వెహికల్స్ నడిపే వాహనదారులపై అదనపు భారం పడనుంది. కార్లపై నిన్నటివరకు75 రూపాయలు వసూలు చేయగా, నేటి నుంచి రూ.83 వసూలు చేయనున్నారు.
ఇటీవలే పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగి నడ్డివిరుస్తుంటే... ఇప్పుడు తాజాగా టోల్ రేట్లు కూడా పెంచేయడంపై ప్రయాణికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ప్రయాణించే తమలాంటి సామాన్యులకు ఇది మోయలేని ఆర్థిక భారమని వాపోతున్నారు.
