ఫేక్ ఐడీ కార్డులతో ‘టోల్’ ఎగ్గొడుతున్నారు

ఫేక్ ఐడీ కార్డులతో ‘టోల్’ ఎగ్గొడుతున్నారు

హైదరాబాద్, వెలుగు: వాస్తవానికి జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజా వద్ద కేవలం టూవీలర్స్​కు మాత్రమే ఫీజు మినహాయింపు ఉంటుంది. ఇక మిగిలిన వాహనాల్లో అంబులెన్స్, ఫైర్ లాంటి ఎమ్మర్జెన్సీ సేవల వాహనాలకు, రాష్ట్రపతి, ప్రధాని, సీఎం, మంత్రులు, సుప్రీంకోర్టు జడ్జి, కౌన్సిల్ చైర్మన్ , స్పీకర్ , హైకోర్టు చీఫ్ జస్టిస్, హైకోర్టు జడ్జి, ఎగ్జిక్యూటి వ్ మెజిస్ట్రేట్ తోపాటుగా ప్రజాప్రతినిధులకు కూడా టోల్ చార్జీని మినహాయిస్తారు. అలాగే, దేశ సైనికులు, ఎయిర్ ఫోర్సు , నేవీ వారి వాహనాలకు ఫీజు చెల్లించాల్సిన అసవరం లేదు. ఇదిలాఉంటే.. కొందరు ప్రజాప్రతినిధుల స్టిక్కర్లు, పోలీస్ , రెవెన్యూ‌‌‌‌, పోలీసు, హెచ్ ఎండీఏ, ప్రెస్, గవర్నమెంట్ ఆర్ అండ్ బీ, ప్రభుత్వ శాఖల అధికారులమంటూ ఫేక్ ఐడీ కార్డులు సృష్టించి వాహనాల్లో తిరుగుతున్నట్లు నిర్వాహకులు గుర్తించారు. పుప్పాలగూడ ఔటర్ రింగురోడ్డు టోల్ ప్లాజా వద్ద కొద్ది రోజుల కిందట నకిలీ తతంగం వెలుగులోకి వచ్చినట్లు తెలిసింది.

కొందరు ప్రభుత్వ అధికారులమంటూ.. వారి వాహనాలకు గవర్నమెంట్ స్టిక్కర్లను చూపి టోల్ ఫీజు కట్టకుండా అక్కడి నుం చి వెళ్లేందుకు ప్రయత్నించినట్టు తెలిసింది. గుర్తింపు కార్డులు చూపమని నిర్వాహకులు అడిగితే నిర్వాహకులతో ఘర్షణకు దిగినట్టు తెలిసింది. రెగ్యులర్ ఉద్యోగులు కాకుండా ఫేక్ ఐడీ కార్డులతో తిరుగుతున్నారని నిర్వాహకులు ఆరోపిస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నిర్వాహకులు ప్రిన్సి పల్ సెక్రటరీ దృష్టికి కూడా వచ్చినట్టు తెలిసింది. టోల్ ఫీజు కట్టకుండా ఎగవేతకు చాలా మంది ప్రయత్నిం చినట్లు హెచ్ ఎండీఏ గుర్తించింది. ఇదే కాకుండా నగరం చుట్టూరా ఉన్న టోల్ గేట్ల వద్ద కూడా ఈ తరహాలో మోసానికి పాల్పడుతున్నారన్న విషయాలను కూడా హెచ్ ఎండీఏ అధికారులు పరిశీలిస్తున్నారు. అడపాదడపా టోల్ ఫీజు కట్టకుండా నిర్వాహకులతో గొడవపడి అక్కడి నుంచి పరార్ కాగా, ప్రజాప్రతినిధులు, అధికారులమంటూ నిర్వాహకులను దబాయించిన సంఘటనలున్నాయి.

అయితే, పుప్పాలగూడ టోల్ ప్ లా జా వద్ద ఫీజు ఎగవేతకు పాల్పడిన అంశంపై కఠిన చర్యలు తీసుకునేందుకు అధికార యంత్రాంగం సిద్ధమైనట్టు తెలిసింది. దీనితోడు భవిష్యత్తులో ఓఆర్ ఆర్ చుట్టూరా టోల్ ప్లాజాల వద్ద ఈ తరహా ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్రత్యేక దృష్టి సారించినట్లు హెచ్ ఎండీఏ వర్గాల ద్వారా తెలిసింది. నగరం చుట్టూ టోల్ ప్లా జాలు హైదరా బాద్– వరంగల్ ప్రధాన రహదారిలో భువనగిరి యాదాద్రి జిల్లా బీబీనగర్ వద్ద​, హైదరాబాద్ – విజయవాడ రహదారిలో నల్గొండ జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి వద్ద టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇంటర్ ఛేంజ్ టోల్ ప్లా జాలు పెద్ద అంబర్ పేట, మేడ్చల్, కోకాటపేట, రాజేంద్రనగర్, శంషాబాద్ , ఇదులానాగ్ పల్లి, పటాన్ చెరు, శామీర్ పేట, ఘట్ కేసర్ , కీసర, టీఎస్ పీ, నానాక్ రాం గూడ, పెద్ద గోల్కొండ, రావిరాయల్ , తుక్కుగూడ, తారామతిపేట, సుల్తాన్ పూర్ , సారాగూడెం , బొంగూళురుల్లో ఉన్నాయి.

ఔటర్ రిం గ్ రోడ్ (నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డు) తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ చుట్టూ ఎనిమిది వరుసలతో 158 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఈ ఔటర్ చుట్టురా హైదరాబాద్ మహానగర పాలక సంస్థ ద్వారా రూ. 6,696 కోట్ల వ్యయంతో నిర్మించబడింది. జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ (జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ) రూ. 3.123 కోట్లు సహాయం చేసింది. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వాహనాలు వెళ్లేలా ఈ రహదారి రూపొందిం చారు. ఈ రహదారిలోని పెద్ద భాగం 124 కిలోమీటర్ల మేర హైటెక్ సిటీ, నానక్ రాంగూడా, రాజీవ్ గాంధీ తర్జాతీయ విమానాశ్రయం, ఐకెపి నాలెడ్జ్ పార్క్, హార్డ్వేర్ పార్క్, తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ, సింగపూర్ ఫైనాన్షియల్ జిల్లా , గేమ్స్ గ్రామాల మీదుగా వెళుతుంది. డిసెంబర్ 2012 ప్రారంభించబడింది. ఔటర్ చుట్టూ 44, 65, 161, 163, 765 మొదలైన జాతీయ రహదారులను కలుపుతుంది. దీనివల్ల నిజామాబాద్, ఆదిలాబాద్ వంటి నగరాల నుంచి జాతీయ రహదారి 44 ద్వారా రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రయాణించే సమయం తగ్గుతుందని దీన్ని నిర్మించారు. ఆయా రహదారుల వద్ద టోల్ ప్లాజాలను ఏర్పాటు చేశారు.