అవతార్ -2 సినిమాపై ఆర్జీవీ కామెంట్స్

అవతార్ -2 సినిమాపై ఆర్జీవీ కామెంట్స్

కలెక్షన్స్, విజువల్ తో వండర్స్ సృష్టించి రికార్డ్ లు క్రియేట్ చేసిన సినిమా అవతార్. దానికి సీక్వెల్ గా వచ్చిన అవతార్-2 ది వే ఆఫ్ వాటర్ కూడా అదే టాక్ తో నడుస్తుంది. 3:15 గంటలున్న ఈ సినిమా చూస్తూ సినీ ప్రేక్షకులు మైమరచిపోతున్నారు. అయితే, టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా గురించి తనదైన శైలిలో స్పందించాడు.

‘ఇప్పుడే అవతార్-2 సినిమాలో స్నానం చేసి వచ్చా (సినిమా చూశా). దీనిని సినిమా అనడం నేరం. ఎందుకంటే ఈ సినిమా ద్వారా నాకు జీవితకాల అనుభూతి లభించింది. అద్భుతమైన విజువల్స్, మైండ్ బెండింగ్ యాక్షన్స్ ఉన్నాయి. సినిమా చూస్తుంటే కొన్ని సార్లు ఇది థీమ్ పార్క్ విజిట్ బిట్ లాగా అనిపించింది’ అంటూ ట్వీట్ చేశాడు. అయితే, ట్వీట్ చదివిన ఫ్యాన్స్ మాత్రం వర్మ వ్యంగ్యంగా అన్నాడా? లేక నిజంగానే మెచ్చుకున్నాడా అన్న సందిగ్ధంలో పడిపోయారు.