రెడీగా ఉండండి : కిలో ట‌మాటా రూ.250 అవుతుంది

రెడీగా ఉండండి :  కిలో ట‌మాటా రూ.250 అవుతుంది

దేశవ్యాప్తంగా టమాటా ధరలు హవా కొనసాగుతోంది. హైదరాబాద్ లో కీలో టమాటా ధర రూ.200 పలుకుతుండగా రాబోయే వారం రోజుల్లో ధర మరింత పెరిగి రూ.250కి చేరే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. దీంతో ధర పెరగకముందే  వ్యాపారులు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుండి టమోటాలను దిగుమతి చేసుకుంటున్నారు.  అయితే ఈ రాష్ట్రాల్లో అడపాదడపా కురుస్తున్న వర్షాల కారణంగా పంటలకు భారీ నష్టం వాటిల్లడంతో ఆయా ప్రాంతాల నుంచి టమాటా రాక కొరత ఏర్పడింది. 

దీంతో ఇప్పుడు హైదరాబాద్‌తోపాటు తెలంగాణలోని ఇతర జిల్లాల్లోని టమాటాలు పంజాబ్‌ నుంచి దిగుమతి అవుతున్నాయి.  ధరల పెరుగుదల కారణంగా హైదరాబాద్‌లోని  ప్రజలు టమాటాలు కొనకుండానే వెళ్లిపోతున్నారు.  వంటింట్లో చాలా కూరలు టమాటాలతోనే ముడిపడి ఉండడంతో ఇటు కొనలేక, ఇటు వంటలు చేయలేక ప్రజలు ఆవేదన చెందుతున్నారు.   

అటు మదనపల్లి మార్కెట్‌లోనే కిలో టమాటా రూ.196గా ఉంది. మొదటిరకం కిలో రూ.160 నుంచి రూ.196, రెండోరకం రూ.120 నుంచి రూ.156 ధర పలకడంతో 20 కిలోల బుట్ట ధర రూ.4500-4900 వరకు వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.