అలర్ట్...ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్

అలర్ట్...ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు టెన్త్ రిజల్ట్

తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు విద్యాశాఖ అధికారులు. ఏప్రిల్ 30న ఉదయం11 గంటలకు విడుదల చేస్తున్నట్లు  ఈ మేరకు  పాఠశాల విద్యా శాఖ కమిషనర్  ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటన రిలీజ్ చేశారు. SCERT లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు తెలిపారు  విద్యా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశం.

తెలంగాణలో  పదో తరగతి పరీక్షలు మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరిగాయి.  రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షల 08వేల 385 మంది విద్యార్థులు హాజరయ్యారు.  వీరిలో 2,50,433 మంది బాలికలు… 2,57,952 మంది బాలురు పరీక్షలు రాశారు. పదో తరగతి పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియను ఏప్రిల్ 13 నాటికే పూర్తి చేశారు. పదో తరగతి పరీక్షల ఫలితాలను బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్ సైట్ https://results.bsetelangana.org లో చెక్ చేసుకోవచ్చు.

ఏప్రిల్ 24 న ఇంటర్ రిజల్ట్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.  ఫస్ట్ ఇయర్ లో 60.01 సెకండియర్ లో 64.19 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఫస్టియర్ ఫలితాల్లో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో టాప్ లోనిలవగా..సెకండియర్ రిజల్ట్ లో ములుగు జిల్లా అత్యధిక ఉత్తీర్ణతతో ఫస్ట్ ప్లేసులో నిలిచింది.