Krishnamma: ఒక్క సినిమా కోసం ఐదుగురు స్టార్ డైరెక్టర్స్.. గట్టిగా ప్లాన్ చేసిన కొరటాల

Krishnamma: ఒక్క సినిమా కోసం ఐదుగురు స్టార్ డైరెక్టర్స్.. గట్టిగా ప్లాన్ చేసిన కొరటాల

టాలీవుడ్ టాలెంటెడ్ నటుడు సత్యదేవ్(Sathya Dev) హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కృష్ణమ్మ(Krishnamma). టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ(Koratala Shiva) సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యాన‌ర్‌పై కృష్ణ కొమ్మలపాటి నిర్మిస్తుండ‌గా.. దర్శకుడు వి.వి.గోపాల కృష్ణ తెరకెక్కిస్తున్నాడు.చాలా కాలం క్రితమే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ఎట్టకేలకు మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. రురల్ బ్యాక్డ్రాప్ లో రా అండ్ రస్టిక్ కంటెంట్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. 

రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంలో కృష్ణమ్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఎంతో ఘనంగా జరుగనున్న ఈ వేడుక కోసం టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. రాజమౌళి, సుకుమార్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, కొరటాల శివ హాజరుకానున్నారట. ఇదే విషయాన్ని కృష్ణమ్మ మూవీ టీమ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. కృష్ణమ్మ సినిమాకు సమర్పకుడిగా ఉన్న డైరెక్టర్ కొరటాల శివ ఆహ్వానం మేరకు ఈ స్టార్ డైరెక్టర్ ఈవెంట్ కు హాజరు కానున్నారని సమాచారం. దీంతో కృష్ణమ్మ సినిమాపై బయట మంచి పబ్లిసిటీ క్రియేట్ అయ్యింది . 

ఇక కృష్ణమ్మ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమా సత్యేదేవ్ జోడీగా అతిరా రాజీ నటిస్తున్నారు. కీరవాణి కుమారుడు కాల భైరవ సంగీతం అందిస్తున్నారు. టీజర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని సాధిస్తుంది అనేది చూడాలి.