బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ కళ్యాణ్.. ఎవరో ఉప్పు అందిస్తే మాట్లాడడం మానుకో..: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ కళ్యాణ్.. ఎవరో ఉప్పు అందిస్తే మాట్లాడడం మానుకో..: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై ఘాటైన వ్యాఖ్యలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. బీజేపీ ఆడిస్తున్న తోలుబొమ్మ పవన్ కళ్యాణ్ అని.. బీజేపీ పలికించేవే ఆయన మాట్లాడుతున్నారని అన్నారు. సోమవారం ( జూన్ 15 ) మీడియాతో మాట్లాడుతూ తెలంగాణను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ గా ఈ వ్యాఖ్యలు చేశారు మహేష్ కుమార్ గౌడ్. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడొద్దని అన్నారు.

పవన్ కళ్యాణ్ తెలంగాణను కించపరుచుతుంటే కేసీఆర్, హరీష్ రావు ఎందుకు స్పందించడం లేదని అన్నారు. విభజన గురించి మాట్లాడడం అంటే విభజనను వ్యతిరేకించినట్టే అని.. తెలంగాణ ఉద్యమం నడిచినప్పుడు పవన్ ఏ సినిమాలో నటించాడు చెప్పాలని అన్నారు. తెలంగాణకి రావొద్దని పవన్ కళ్యాణ్ ను ఎవరు ఆపడం లేదని... సినిమా నటుడిగా పవన్ వస్తే మా ఇంటికి పిలిచి భోజనం పెడతానని అన్నారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ఎలా వచ్చిందో సినిమా నటుడు తెలుసుకోవాలని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.

►ALSO READ | గండిపేట భూముల కేసులో మాజీ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడుకు మరో షాక్...

ఇదేం సినిమా కాదని పవన్ గుర్తు పెట్టుకోవాలని.. సినిమా డైలాగులు మాట్లాడితే నడవదని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. పవన్ కళ్యాణ్ పదే పదే తెలంగాణను కించ పరిచేలా మాట్లాడుతున్నారని..ప్రత్యేక  తెలంగాణ తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్ష అని అన్నారు. తెలంగాణ ఆవిర్భావాన్ని మోదీ, అమిత్ షా కించపరిచారని అన్నారు మహేష్ కుమార్ గౌడ్. ఇది తెలంగాణ అని పవన్ కళ్యాణ్  గుర్తు పెట్టుకోవాలని..పవన్ మాత్రమే కాదు ఎవరు తెలంగాణను కించపరిచినా ఊరుకునేది లేదని అన్నారు.

దేశానికి స్వాతంత్ర్యం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ అని.. కాంగ్రెస్ తయారు చేసిన రాకెట్ల ముందు మోదీ ఫొటోలు దిగుతున్నారని అన్నారు. కాంగ్రెస్ చరిత్ర గురించి మాట్లాడే అర్హత పవన్ కళ్యాణ్ కి లేదని... పవన్ చాలా చిన్నవాడని.. ఆయన చాలా నేర్చుకోవాలని అన్నారు మహేష్ కుమార్ గౌడ్.