ఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం

ఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం

ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేసీఆర్ మహిళా హంతకులని మండిపడ్డారు. నలుగురు మహిళలు మృతిచెందిన ఘటనలో అధికారిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆరోపించారు. హెల్త్ మినిస్టర్ బాధిత కుటుంబాలను పరామార్శించి అండగా నిలవాలని సూచించారు. ఈ ఘటనపై జాతీయ మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. 

గురువారం నుంచి మునుగోడులో కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం ప్రారంభమవుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. మండల ఇంఛార్జ్లు ఒక్కొక్కరు మూడు గ్రామాలు తిరగాలన్న ఆయన.. 6 వరకు ఒక విడత ప్రచారం పూర్తవ్వాలని సూచించారు. 3న ప్రెస్ మీట్ ఉంటుందని..అందులో తాను, భట్టి  జానారెడ్డి, ఉత్తమ్, వెంకట్ రెడ్డి,  పాల్గొంటామన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కాంగ్రెస్ కు ఓటు వెయ్యాలని కోరుతామని.. రైతు డిక్లరేషన్ ను వివరిస్తామని తెలిపారు.