రేవంత్ రెడ్డికి జ్వరం.. మునుగోడు పాదయాత్రకు దూరం

రేవంత్ రెడ్డికి జ్వరం..  మునుగోడు పాదయాత్రకు దూరం

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.  తీవ్ర జ్వరంతో భాపడుతున్నారు. కరోనా లక్షణాలు ఉండడంతో సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిపోయారు. శాంపిల్స్ ను పరీక్షలకు పంపించారు.  అనారోగ్యంగా ఉండటంతో ఇవాళ మునుగోడులో నిర్వహించనున్న  ఆజాదీకా గౌరవ్  పాదయాత్ర కు రేవంత్ రెడ్డి దూరంగా ఉండనున్నారు. 

ఈ యాత్ర ఏడు గ్రామాల మీదుగా 15 కిలోమీటర్ల  వరకు సాగేలా ప్లాన్ చేశారు.  చౌటుప్పల్, నారాయణపూర్ లో పాదయాత్ర సాగనుంది. ఇందులో జానారెడ్డి, ఉత్తమ్ , భట్టి విక్రమార్క, దామోదర్ రెడ్డిలతో పాటు పలువురు సీనియర్లు కూడా పాదయాత్రలో పాల్గొననున్నారు.