కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల గొయ్యితీసి పాతిపెట్టాలి : రేవంత్ రెడ్డి

కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల గొయ్యితీసి పాతిపెట్టాలి : రేవంత్ రెడ్డి

ప్రగతి భవన్ గోడలు కూల్చుతామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మరోసారి హెచ్చరించారు. ములుగులో తాను  మాట్లాడిన వ్యాఖ్యలతో బీఆర్ఎస్ నేతలు తనపై కేసులు పెడుతున్నారని అన్నారు. ప్రగతి భవన్ అనే గడిలోకి సామాన్యులకు ఎందుకు ప్రవేశం లేదని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపులకు, కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్లకు ప్రగతి భవన్ అడ్డాగా మారిందని ఆరోపించారు. మహబూబాబాద్ లో  రాక్షస పాలన నడుస్తోందన్న రేవంత్...  కలెక్టర్లకు కూడా రక్షణ లేదని అన్నారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే మహిళా కలెక్టర్ చేయి పట్టి గుంజిన దుర్మార్గడని ఆరోపించారు. రాజ్యాలను కూల్చి, రాచరికాన్ని బొందపెట్టిన ఘనత తెలంగాణ పౌరుషానిదని చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని 100 మీటర్ల గొయ్యితీసి పాతిపెట్టాలని తన దగ్గర బాధితులు గోడు వెళ్లబోసుకుంటున్నారని చెప్పారు.  కొత్త సంవత్సరం ప్రగతి భవన్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామన్నారు.