కవితను పార్టీలోకి రమ్మంది బీజేపీనే.. కాంగ్రెస్ కాదు : రేవంత్ రెడ్డి

కవితను పార్టీలోకి రమ్మంది బీజేపీనే.. కాంగ్రెస్ కాదు : రేవంత్ రెడ్డి

ఫాంహౌస్ కేసులో కవితను కూడా విచారించాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. తనను బీజేపీ సంప్రదించిందని కవిత స్వయంగా చెప్పినందున దాన్ని సుమోటోగా తీసుకుని సిట్ విచారణ జరపాలన్నారు. కవిత స్టేట్మెంట్ తీసుకుని.. ఆమెకు ఎవరు ఆఫర్ ఇచ్చారో విచారణ జరిపి తేల్చిచెప్పాలని అన్నారు. కవితను పార్టీలోకి రావాలని బీజేపీ ఆహ్వానించిందే తప్ప..కాంగ్రెస్  కాదని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

మొయినాబాద్ ఫాంహౌస్ వ్యవహారంలో బీజేపీ పాత్ర లేకపోతే కోర్టుకు ఎందుకు వెళ్లిందని రేవంత్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేల కొనుగోళ్లుపై కేసీఆర్ నీతులు చెప్తున్నారని.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎలా జాతిరత్నాలు అయ్యారని నిలదీశారు. ఎమ్మెల్యేల కొనుగోలుకు మొదట తెరలేపిందే టీఆర్ఎస్ అని విమర్శించారు. ఈ వ్యవహారంపై సిట్ సమగ్ర విచారణ జరిపి బాధ్యులందరినీ అరెస్ట్ చేయాలని రేవంత్ డిమాండ్ చేశారు. 


 
రాష్ట్రంలో బీజేపీ టీఆర్ఎస్ కలుషిత వాతావరణం సృష్టిస్తున్నాయని రేవంత్ మండిపడ్డారు. వాటాల్లో తేడాలతోనే బీజేపీ, టీఆర్ఎస్ మధ్య కొట్లాట జరుగుతోందన్నారు. ఇందుకోసమే బీజేపీ ఈడీ, సీబీఐలతో దాడులు చేయిస్తుంటే.. రాష్ట్ర ప్రభుత్వం ఏసీబీ, ఎస్జీఎస్టీ, పోలీసులతో దాడులు చేయిస్తోందని మండిపడ్డారు. వివాదాల ముసుగులో పాలకుల 8ఏళ్ల తప్పిదాలను తప్పిచుకోవాలని చూస్తున్నారని విమర్శించారు.