V6 News

టీచర్ల పైరవీ డిప్యూటేషన్లను రద్దు చేయాలి..సొంత బడులకు పంపాల్సిందే: టీపీటీఎఫ్

టీచర్ల పైరవీ డిప్యూటేషన్లను రద్దు చేయాలి..సొంత బడులకు పంపాల్సిందే: టీపీటీఎఫ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పైరవీలతో డిప్యూటేషన్లు పొంది హైదరాబాద్, దాని చుట్టుపక్కల జిల్లాల్లో తిష్టవేసిన టీచర్ల బదిలీ ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ కుమార్, ప్రధాన కార్యదర్శి తిరుపతి డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు. 2025–-26 విద్యా సంవత్సరం ప్రారంభంలో సుమారు 200 మందికిపైగా టీచర్లు పలుకుబడితో విద్యాశాఖ రాష్ట్ర ఆఫీసు ద్వారా డిప్యూటేషన్లు పొంది హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని స్కూళ్లలో పనిచేస్తున్నారని ఆరోపించారు.

ప్రతిసారి విద్యా సంవత్సరం చివరి పనిదినం రోజున అన్ని రకాల డిప్యూటేషన్లు రద్దయి, టీచర్లు తమ సొంత స్కూళ్లకు  వెళ్లాల్సి ఉంటుందని, కానీ వారు అక్కడే కొనసాగేలా విద్యాశాఖ ఉత్తర్వులు ఇవ్వడాన్ని ఖండిస్తున్నట్టు తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభం కానున్న నేపథ్యంలో, టీచర్లు తమ సొంత  స్కూళ్లలో ఉంటేనే విద్యార్థుల నమోదు పెరుగుతుందని స్పష్టం చేశారు. అడ్మినిస్ట్రేటివ్ సర్దుబాటు పేరిట జిల్లాల్లోకి పంపిన వారిని, పైరవీలతో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు వచ్చిన వారిని వెంటనే వెనక్కి పంపాలని కోరారు.