
హైదరాబాద్: ఓ డ్రైవర్ నిర్లక్ష్యానికి మూడేళ్ల బాలుడు బలయ్యాడు. బస్ రివర్స్ చేస్తున్న సమయంలో టైరు కింద పడి బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. నగరంలోని ఎంజీబిఎస్ బస్ స్టాండ్‌లో ఈ ఘోరం జరిగింది. నిజామాబాద్ డిపోకు చెందిన బస్ (నెంబర్ TS16Z0127) బస్టాండ్‌లోని ప్లాట్ ఫారం 74 సమీపంలో ఆగింది. డ్రైవర్ అజిత్ సింగ్ బస్సును రివర్స్ తీసుకుంటున్న సమయంలో వెనుక వైపు ఉన్న బాలుడిని గమనించలేదు. దీంతో కిషన్ బాగ్ కు చెందిన మహమ్మద్ ఆహన్(3) టైర్ క్రింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. బాలుడి మృతితో అతని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు.