రెండో DTH కనెక్షన్‌‌‌‌‌‌‌‌కు డిస్కౌంట్లు

రెండో DTH కనెక్షన్‌‌‌‌‌‌‌‌కు డిస్కౌంట్లు

ఒకే ఇల్లు, లేదా లొకేషన్‌ లో ఇవ్వొచ్చు: ట్రాయ్‌

న్యూఢిల్లీ: ఒకే ఇల్లు లేదా లొకేషన్‌‌‌‌‌‌‌‌లో , రెండో లేదా అంతకుమించిన డీటీహెచ్‌ కనెక్షన్లపై ఆపరేటర్లు డిస్కౌంట్లు ఇవ్వొచ్చని టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌‌‌‌‌‌‌‌) స్పష్టం చేసింది. అంతేకాదు, అలాంటి కనెక్షన్స్‌‌‌‌‌‌‌‌ మీద నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ కెపాసి టీ ఫీజు కూడా తగ్గించుకునే స్వేచ్ఛ ఆపరేటర్లకు ఉందని తెలిపింది.

ఐతే, ఆ లొకేషనంతటికీ ఒకే విధానం పాటించాలని, దాన్ని ఆపరేటర్లు పారదర్శకంగా తమ వెబ్‌‌‌‌‌‌‌‌సైట్‌‌‌‌‌‌‌‌లో పొందుపరచాలని పేర్కొంది. “కొందరు సర్వీస్‌‌‌‌‌‌‌‌ ప్రొవైడర్లు (ఆపరేటర్లు) రెండో, అంతకుమించిన కనెక్షన్లపై డిస్కౌంట్లు ఇవ్వడమో, నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ ఫీజును మొత్తంగా ఎత్తివేయడమో చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఒకే ఇంటిలో మల్టిపుల్‌‌‌‌‌‌‌‌ కనెక్షన్స్‌‌‌‌‌‌‌‌ తీసుకోవడానికి ఎంత ధర చెల్లించాలని కొందరు సబ్‌‌‌‌‌‌‌‌స్క్రయిబర్లు సందేహం వ్యక్తం చేయడంతో ఈ వివరణ ఇస్తున్నాం”  అని ట్రాయ్‌‌‌‌‌‌‌‌ ఒక ప్రకటనలో తెలిపింది.

మొదటి కనెక్షన్‌‌‌‌‌‌‌‌కు, 100 ఎస్‌‌‌‌‌‌‌‌డీ ఛానెళ్లు రూ.130 నెట్‌‌‌‌‌‌‌‌వర్క్‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ ఫీతో అందించాలనేదే తమ నిబంధనగా వివరించింది. మరో 25 ఎస్‌‌‌‌‌‌‌‌డీ ఛానెళ్లకు అదనంగా రూ. 20 చెల్లించాలని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి ఈ కొత్త టారిఫ్‌‌‌‌‌‌‌‌ విధానం అమలులోకి వచ్చింది.