- కలెక్టర్ పర్యవేక్షణలో 27న కౌన్సెలింగ్ నిర్వహణ
హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లాలో పంచాయతీ కార్యదర్శుల బదిలీల ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని జిల్లా పంచాయతీ అధికారి (డీపీఓ) సురేశ్ మోహన్ ఆదివారం తెలిపారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో, కమిషనర్ కార్యాలయ ఉత్తర్వుల ప్రకారం బదిలీల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. జిల్లాలోని గ్రేడ్-I నుంచి జూనియర్ జీపీ కార్యదర్శుల వరకు, ఒకే స్టేషన్‌లో మూడేండ్లు పూర్తి చేసుకున్న వారి వివరాలను సేకరించి, రూల్స్ ప్రకారం ఆప్షన్ ఫారాలను కోరామని చెప్పారు.
బదిలీల ప్రక్రియను జిల్లా కలెక్టర్, అడిషనల్కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ పర్యవేక్షిస్తోందని వెల్లడించారు. ఇప్పటికే తాత్కాలిక ఖాళీల జాబితాను ప్రచురించి, అభ్యంతరాలను కోరామని, వాటిని పరిష్కరించాక తుది జాబితా విడుదల చేస్తామన్నారు. ఈ నెల 27న కౌన్సెలింగ్ నిర్వహిస్తామని చెప్పారు.
