V6 News

రవాణా శాఖలో పదోన్నతులకు డీపీసీ ఆమోదం

రవాణా శాఖలో పదోన్నతులకు డీపీసీ ఆమోదం
హైదరాబాద్​సిటీ, వెలుగు:  రవాణా శాఖలో ఖాళీగా ఉన్న డిప్యూటీ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​( డీటీసీ), జాయింట్​ ట్రాన్స్​పోర్ట్​ కమిషనర్​ (జేటీసీ) పదోన్నతులకు  స్పెషల్ చీఫ్​ సెక్రటరీ వికాస్ రాజ్ నేతృత్వంలోని డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది . రంగారెడ్డి డీటీసీ మామిండ్ల  చంద్ర శేఖర్ గౌడ్ , మహబూబ్ నగర్ డీటీసి శివ లింగయ్యలను జాయింట్ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్లుగా .. ఉప్పల్ ఆర్టీవో వాణి , ఖమ్మం ఆర్టీవో ఆఫ్రిన్, మెహదీపట్నం ఆర్టీవో కిషన్  కొత్తగూడెం ఆర్టీవో సదానందం నాగోల్ ఆర్టీవో రవీందర్ కుమార్, సూర్యా పేట ఆర్టీవో సురేష్ రెడ్డి లను డీటీసీలుగా పదోన్నతులు కల్పిస్తూ డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీ ఆమోదం తెలిపింది .  త్వరలో ఉత్తర్వులు వెలువడనున్నాయి.